అర్ధరాత్రి వేళలో విజయవాడలోని సింగ్ నగర్‌కి బోటులో వెళ్ళి ముంపులో వున్న ప్రజలను పరామర్శించిన చంద్రబాబు, అర్ధరాత్రి వేళలోనే విజయవాడ నగరంలోని కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరి వెళ్ళారు. కృష్ణలంకలో రక్షణ గోడకు సమాంతరంగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చంద్రబాబు అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. అంతకుముందు విజయవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు అధికారులతో సమావేశమయ్యారు. వరద సహాయక చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పదిన్నర లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వుందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. బుడమేరు బాధితులు కట్టుబట్టలతో వస్తున్నారని, వారికి దుస్తులతోపాటు దుప్పట్లు కూడా ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-to-krishna-lanka-25-184060.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.