ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే!

Publish Date:May 15, 2025

Advertisement

ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.  తమ యుద్ధం ఉగ్రవాదంపైనే తప్ప.. పాక్ పౌరులపై కాదని విస్పష్టంగా ప్రకటించిన ప్రధాని, కాల్పుల విమరణ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ భారత్ పై పంజా విసరనంత వరకేననీ,  అటువైపు నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా యుద్ధమేననీ విస్పష్ట హెచ్చరిక చేశారు.  

అదే సమయంలో కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామనీ, పాక్ తో దౌత్య సంబంధాల ప్రశ్నే లేదనీ తేల్చేసిన  ఆయన ఇండస్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న తేల్చేశారు.  ఆపరేషన్ సిందూర్ ఆగలేదని పాకిస్తాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధ చర్యగానే భావించి ప్రతి దాడులు చేస్తామనీ హెచ్చరించారు.  ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిని ఉన్న పాకిస్థాన్ కు ఈ హెచ్చరిక చాలదా? మరోసారి భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించాలంటే వణుకుపుట్టడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే.. అవి  ఉగ్రవాద  నిర్మూలన,పీవోకే అంశాలపైనేననీ క్లియర్ కట్ గా చెప్పేశారు.  

అలాగే పాక్,భారత్ మధ్య   ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించడం ద్వారా పరోక్షంగా అమెరికాకు మీ మర్యాద మీరు కాపాడుకోండన్న హెచ్చరికా చేశారు.  పాక్  యుద్ధం ఆపమని కాళ్ల బేరానికి రావడం,అమాయక పౌరులు సంక్షోభంలో పడటం ఇష్టం లేక మాత్రమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని కుండబద్దలు కొట్టినట్లు మోడీ చెప్పారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్థాన్ భారత్ కాళ్లా వేళ్లా పడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దు పునస్సమీక్షించండి ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటోంది. ఈ ఒప్పందం రద్దు కారణంగా నీటి సమస్యతో  నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నామంటూ లేఖ రాసింది. దీనిని బట్టే మోడీ తన వ్యూహాలతో పాకిస్థాన్ ను చక్రబంధంలో బిగించేశారనీ, ఆ దేశం ఇక తోక జాడించే అవకాశాలు ఇంచుమించు లేవనీ అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.