జగన్ సహా మోడీకి 30 మంది దత్తపుత్రులు!

Publish Date:May 10, 2023

Advertisement

 మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారు. వారిలో జగన్ ఒకరు. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను కాపాడేందకు ప్రధాని దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే.. మోడీని గద్దె దింపడం ఒక్కటే మార్గం. అందుకే  దేశాన్నిరక్షించండి.. మోడీని ఓడించండి అన్ననినాదంతో  విపక్షాల ఐక్యత కోసం వామపక్షాలు నడుంబిగించాయి.

అయితే ఏపీలో మాత్రం వారు తమ నినాదాన్ని ఒకింత సవరించుకున్నాయి. దేశానికి మోడీ ఎలాగో.. రాష్ట్రానికి జగన్ అలా తయారయ్యారనీ, సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని యిరువురూ దెబ్బతీస్తున్నారని వామపక్షాలు అంటున్నాయి. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరుతారన్నట్లుగా.. విధ్వంసం, విద్వేషమే స్వీయ సిద్ధాంతంగా వ్యవహరిస్తున్న మోడీ, జగన్ లు యిద్దరూ ఏపీలో కుమ్మక్కై పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

యిరువురి మధ్యా రహస్య సంబంధం ఉందంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ ఓ అడుగు ముందుకు వేసి జగన్ ను దుర్యోధనుడితో పోల్చారు. మూడు పదులకు పైగా సలహాదారులను ఏర్పాటు చేసుకుని ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.  బటన్‌ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. వెూదీ  అండతో జగన్ విర్రవీగుతున్నారనీ, ఆ అండ పోయిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని నారాయణ అన్నారు.

   వచ్చే ఎన్నికలలో బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్‌ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే రూ.2500 ఉన్న టికెట్‌ ధరలను రూ.25 వేలు చేశారని మండిపడ్డారు.  ఎయిర్‌ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం పైవేట్‌ వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పైవేట్‌ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం పైవేట్‌ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చిందన్నారు. ప్రధాని వెూదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారన్నారు. మోడీ దత్తపుత్రులు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.  

బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారని విమర్శించారు. కర్ణాటకలో గెలుపు కోసం వెూడీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, వెూడీ బంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారని నారాయణ ఆరోపించారు.

ఏపీలో అడుగడుగునా వెూడీకి సీఎం జగన్‌ అనుకూలంగా ఉన్నారన్నారు. రాష్టాన్రికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని నారాయణ అన్నారు.  కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్.. యిరువురూ తమ ప్రజా వ్యతిరేక విధానాలతో ఎక్కడిక్కడ జనాన్ని దోపిడీకి గురి చేస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో వీరిరువురినీ గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నారాయణ అన్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.