విజయసాయికి మెచ్చి మేకతోలు కప్పారా?

Publish Date:May 10, 2023

Advertisement

విజయసాయి రెడ్డి తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా, జగన్ అక్రమాస్తుల కేసులో సహ  నేరస్తుడిగా, ఏ2గా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంలోనూ.. జగన్ ముఖ్యమంత్రి కావడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయి.

గత ఎన్నికలకు ముందు, పార్టీ అధికారంలోకి వచ్చాకా కూడా కుడి ఎడమ భుజాలు తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోకుండా మరుగున పడిపోయారు. రాజ్యసభ సభ్యుడు కనుక ఢిల్లీలో షెల్టర్ తీసుకున్నారు. అక్కడే దాదాపు ఒంటరిగా తిరుగుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు ఆయనను కలవడానికే యిష్టపడటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎలాగో.. అణిగిమణిగి ఒండి అత్యంత విశ్వాసపాత్రుడిగా యింత కాలం పని చేసిన విజయసాయి అలాగే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

అనువుగాని చోట మౌనమే మేలు అన్నట్లుగా యిటీవలి కాలంలో విజయ సాయి పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విజయ సాయి యిప్పుడు అసలు దాని జోలికే పోవడం లేదు. ఏదో ఒకటీ రెండూ ట్వీట్లు చేసినా అవి ప్రధాని మోడీ కార్యక్రమాలను పొగడడానికో.. లేదా విపక్ష నేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికో పరిమితమైపోయారు.  అలాంటి విజయసాయికి పార్టీ అధినేత జగన్ హఠాత్తుగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీలో విజయసాయికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేసిందా అన్న చర్చ ప్రారంభమైంది.  

అయితే.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటున్నారు. యిప్పుడు జగన్ ఆయనను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా నియమించారు సరే.. యింతకు ముందు వరకూ ఆ పోస్టులో బాలినేని ఉండేవారు. ఆయన దానిని తిరస్కరించిన తరువాతే  విజయసాయికి జగన్ ఆ బాధ్యతలు అప్పగించారు.   అంత మాత్రాన ఆయన నిజాయితీకి అదినేత మెచ్చి మేకతోలు కప్పారని కాదని పార్టీ శ్రేణులే ఉంటున్నారు. ఆ మూడు జిల్లాలకూ కోఆర్డినేటర్ అవసరం నిజానికి ఏ మాత్రం లేదని వారంటున్నారు. ఎందుకంటే ఆ మూడు జిల్లాలలోనూ యిప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన పెత్తనాన్నీ, ఆధిపత్యాన్ని తట్టుకోలేకే జగన్ కు సమీప బంధువు కూడా అయిన బాలినేని ఓ దడ్డం పెట్టి మరీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలగారు. జగన్ స్వయంగా తన ప్రతినిథులను పంపి మరీ  బుజ్జగించినా బాలినేని దిగి రాలేదు.  

యిక గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను జగన్  సుబ్బారెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచీ సుబ్బారెడ్డికీ, విజయసాయికీ పొసగడం లేదన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.  విజయసాకికి అప్పగించిన మూడు జిల్లాల్లో ప్రకాశం లో సుబ్బారెడ్డి వినా మరెవరూ వేలు పెట్టే అవకాశం లేదు.  చిత్తూరు జిల్లా వైసీపీ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నలలోనే మెలుగుతోంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే అక్కడ సమన్వయం చేయడానికి ఏమీ లేదు. అంటే జగన్ ఏరి కోరి మరీ విజయసాయిరెడ్డికి కట్టబెట్టిన మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవి అలంకార ప్రాయం తప్పితే అక్కడ చేయడానికి ఏమీ లేదు. దీంతో విజయసాయిని మరింతగా అవమానించేలాగే ఈ నియామకం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  

అన్నిటికీ మించి జగన్ తనకు కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టినట్టుగా వార్తలు వచ్చినా విజయసాయి స్పందించలేదు. అధినేతకు కృతజ్ణతలు చెప్పలేదు.దీనిని బట్టి చూస్తుంటే..  విజయసాయికి పార్టీలో ఉన్న గుర్తింపును మరింత పలుచన చేయడమే లక్ష్యంగా ఈ కొత్త పదవి కట్టబెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.