జూన్ 4న ఏపీకి మోడీ.. 7న నడ్డా

Publish Date:May 29, 2022

Advertisement

బీజేపీ ఏపీపై దృష్టి సారించిందా.. అన్న ప్రశ్నకు వరుసగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు రానుండటంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి  వేడుకలలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జూన్ 4న ఏపీ రానున్నారు. భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అదే నెల 7న రాజమండ్రిలో బీజేపీ ఆధ్వరంలో జరిగే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అద్యక్షుడు నడ్డా హాజరు కానున్నారు.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం,  జనసేనల మధ్య పొత్తుపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో మోడీ, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు రానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ, జన సేన పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో జనసేన తెలుగుదేశంతో జట్టు కడితే బీజేపీ  ఏం నిర్ణయం తీసుకోవాలన్నదానిపై పార్టీ నేతలకు మోడీ దిశా నిర్దేశం చేసే అవకాం ఉంది. అలాగే 7న రాజమహేంద్ర వరంలో జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికలకు సమాయత్తమయ్యే దిశగా నడ్డా పార్టీ శ్రేణులకు పిలుపు మార్గ నిర్దేశనం చేస్తారని భావిస్తున్నారు. ఇ

ప్పటికే ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించడం ద్వారా బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీతో మైత్రికి అవకాశం లేదన్న సందేశం ఇచ్చింది. దీనిపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. అయితే పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర నాయకత్వం కాదనీ, బీజేపీ అధిష్టానమేనని ఆయన పార్టీ అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా  చస్తానన్న పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో కలిసి పని చేయడంపై బీజేపీ అధిష్ఘానాన్ని ఒప్పించగలనన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించేలా బీజేపీ అధిష్టానాన్ని తాను ఒప్పించాననీ, అదే రీతిలో రాష్ట్రంలో జగన్ ను అధికారానికి దూరం చేయడం కోసం ఓట్లు చీలకుండా బీజేపీని కూడా పొత్తుకు కలిసి వచ్చేలా ఒప్పించగలనని ధీమా వ్యక్తం చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం, జనసేనల మధ్య ఎన్నికల పొత్తుపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడక పోయినా క్షేత్ర స్థాయిలో జన సేన కార్యకర్తలు తెలుగుదేశంతో కలిసి పని చేస్తున్నారంటే పార్టీ నుంచి వారికి ఆమేరకు స్పష్టమైన సందేశం అంది ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రాష్ట్ర పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.