Publish Date:Oct 28, 2022
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు భేటీ వచ్చే నెలలో బేటీ కానున్నారు. వీరిరువురి మధ్యా భేటీ ఖరారైంది. ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాధినేతల భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంతకీ వీరి భేటీ ఎక్కడంటే... వచ్చే నెల బాలి వేదికగా జరగనున్న జ20 లీడర్ షిప్ సమ్మిట్ కు ఇరువురూ హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ లో భాగంగా ఇరువురు నేతలూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని, ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారని పేర్కొంది.
కాగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని మోడీ రిషి సునాక్ దృష్టికి తీసుకువెళ్లారు. రిషీ సునాక్ హయాంలో భారత్, బ్రిటన్ ల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-25-146201.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.