కాణిపాకం ఆలయంలో బంగారు విభూది పట్టీ చోరీ.. అర్చకుడే దొంగ!

Publish Date:Oct 28, 2022

Advertisement

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి చోరీకి గురైంది. సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో  బావిలో నుంచి వెలసిన విఘ్నేశ్వరుడు‌   భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.   నిత్యం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి‌ భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొంది తరిస్తుంటారు

 స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని ఓ దాత విరాళంగా అందించారు.

ఆ విభూది పట్టీ ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీన కుంభాభిషేకం సందర్భంగా స్వామి వారికి అలంకరించారు. అంతే ఆ రోజు నుంచీ అది కనిపించడం లేదు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ విభూది పట్టీని విరాళంగా ఇచ్చిన దాత తనకు రశీదు ఇవ్వలేదంటూ..అధికారులను సంప్రదించడంతో ఆ బంగారు విభూది పట్టీ కనిపించడం లేదన్న విషయం వెల్లడంది. దీంతో ఆ ఆభరణం గురించి ఆరా తీయడం  ప్రారంభించారు. ఇంతలో గత 45 రోజులుగా కనిపించని ఆ ఆభరణం ఆలయ యోగశాలలో ప్రత్యక్షమైంది. 
ఈ విభూది పట్టీని వేలూరుకు చెందిన ట్రస్ట్ విరాళంగా అందజేసింది. ఈ ఆభరణం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుంది. సాధారణంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి భక్తితో అందించిన విరాళాలకు సంబంధించిన రసీదును ఇస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆలయానికి ముగ్గురు మంత్రులు రావడం, కుంభాభిషేకం కావడంతో అధికారులు హడావుడిలో ఉండి రసీదు ఇవ్వలేదు. విభూది పట్టీని మాత్రం స్వామి వారికి అలంకరించారు.

అయితే ఎన్ని రోజులైనా రసీదు రాకపోవడంతో విభూది పట్టీని విరాళంగా ఇచ్చన ట్రస్ట్ దాతలు రసీదు గురించి అధికారులను సంప్రదించారు.  అప్పుడు విభూది పట్టీ మాయమైన సంగతి వెలుగులోనికి వచ్చింది. ఇంతకీ ఆ విభూది పట్టీని కాజేసింది ఆలయ అర్చకుడేనని తేలింది. లక్షల విలువ చేసే ఆభరణం విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దాతలు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇంత జరిగినా విభూదిపట్టి కాజేసిన ఆలయ అర్చకుడిపై అధికారులు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే విభూది పట్టి మాయం అయిన ఘటన బయటకు వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని అధికారులు, పాలక మండలి విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.