నాన్నా చూడాలని ఉంది.. మావోయిస్టు అగ్రనేత గణపతి కుమారుడి ఆడియో మెసేజ్!

Publish Date:Mar 5, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనాయకుడు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగుబాట పట్టారన్నవార్తలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో  ఆయన కుమారుడు ముప్పాళ్ల వాసు  విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  తండ్రి కోసం, తండ్రి ప్రేమ కోసం చిన్నతనం నుంచీ తాను ఎలా తహతహలాడానో వివరిస్తూ ముప్పాళ్ల వాసు .. తండ్రిని ఉద్దేశించి పంపిన  ఆ వాయిస్ మెసేజ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

భావోద్వేగాలు ఉట్టిపడేలా ఆయన తండ్రిని ఇక రహస్య జీవితం చాలు, తన కోసం జనజీవన స్రవంతిలో కలిసిపొవాలని కోరుతూ చేసిన ఆ విజ్ణప్తి, వినతి, వేడుకోలు అందరిలో ఆర్థ్రత నింపుతున్నాయి.   గణపతి లొంగిపోతారని, ప్రస్తుతం పోలీసుల సంప్రదింపుల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి సమక్షంలో ఆయన లొంగుబాటు జరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో   గణపతి కుమారుడు విడుదల చేసిన  ఆడియో మెసేజ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

తండ్రి ప్రేమ తెలిసినవారి భావాలు ఒకలా ఉంటాయని, తండ్రి ప్రేమ కోసం ఎదురుచూసే తనలాంటి వ్యక్తి భావాలు మరోలా ఉంటాయనీ ఆయన తన వాయిస్ మెజేజ్ ను ఆరంభించారు.  ఊహ తెలిసిన తరువాత ఇప్పటి వరకూ తాను తన తండ్రిని ప్రత్యక్షంగా చూడలేదని పేర్కొన్న వాసు.. ఎన్నోకష్టనష్టాలకు ఓర్చి తన తల్లి తనను పెంచి పెద్దవాడిని చేసిందని చెప్పుకొచ్చారు. తన వాయిస్ మెసేజ్ తో వాసుదేవరావు తండ్రిని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారే తప్ప.. ఇంత కాలం ఆయన అనుసరించిన ఉద్యమ బాట గురించి విమర్శిస్తూ పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు అలా జనం కోసం సర్వం త్యాగం చేయడాన్ని ప్రస్తుతించారు. 

By
en-us Political News

  
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.