అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Publish Date:Apr 27, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్  చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న రెనాల్ట్ మరియు మహేంద్ర కారు షోరూమ్‌లలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైంది.

షోరూమ్‌లో నిలిపి ఉంచిన వాహనాలకు మంటలు అంటుకోవడంతో అగ్ని వేగంగా వ్యాపించింది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.మంటలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడగా, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అగ్ని ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలను పోలీసులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దట్టమైన పొగల కారణంగా అక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.