కొత్త వేషం కట్టిన ఎమ్మెల్సీ కవిత!?

Publish Date:Jun 16, 2025

Advertisement

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత,కొత్త వేషం కట్టారు. పాఠాలు చెప్పే పంతులమ్మగా మారి పోయారు. అయితే  కవితా టీచర్, అందరు టీచర్లు చెప్పే పాఠాలు చెప్పరు. పొలిటికల్ పాఠాలు మాత్రమే చెపుతారు.అది కూడా అందరికీ కాదు.. ఓన్లీ మహిళలు మరియు యువతకు మాత్రమే కవిత మేడం రాజకీయ పాఠాలు  బోధిస్తారు. అందు కోసం  ఆమె  తెలంగాణ జాగృతి తరపున 'లీడర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాగుంది.. ఒకప్పుడు కమ్యూనిస్ట్  పార్టీలు  రాజకీయ పాఠశాలలు నిర్వహించేవి.  అలాగే ఇతర పార్టీలు కూడా శిక్షణ తరగతులు నిర్వహించేవి. ఇప్పుడు అలాంటి పాఠశాలలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వాటి  అవసరం అయితే వుంది. 

యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా కవిత పేర్కొన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు.రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలుకుతుందని   కవిత సెలవిచ్చారు. 
సో .. సంకల్పం మంచిదే. అదీ కాకుండా ఆమే అన్నట్లు  మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ముందు ముందు రాజకీయ నాయకుల అవసరం, మరీ ముఖ్యంగా..  ఎన్నికల్లో పోటీ చేసే మహిళా నాయకుల అవసరం పెరుగుతుంది. అలాగే..  బీసీ రిజర్వేషన్స్ అమలులోకి వచ్చిన తర్వాత  బీసీ నాయకులకు డిమాండ్ పెరుగుతుంది. సో .. కవిత సంకల్పం వరకు అయితే బాగుంది. కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఆమెకు ఆ ఆర్హత, యోగ్యతా ఉన్నాయా  అనేదే ప్రశ్న.   
సరే.. ఆమెకు ఆ అర్హత,యోగ్యతా ఉన్నాయా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినా.. నిజంగా ఆమె సంకల్పం అదేనా లేక అటు పార్టీకి, ఇటు ఫ్యామిలీకి దూరమై కొని తెచ్చుకున్న మనుగడ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆమె కొత్త వేషం కట్టరా అనేది పెద్ద పజ్లింగ్  ప్రశ్న. గత వారం పది రోజులుగా ఆమె పడుతున్న అగచాట్లు, ఫేస్ చేస్తున్న అవమానాలను గమనిస్తే..  కవిత  లీడర్  కార్యక్రమం పరమార్ధం  మనుగడ కాపాడు కోవడం కోసమే అని వేరే చెప్ప నక్కర లేదు. 

అవును.. ఉదర పోషణార్ధం బహుకృత వేషం  అంటారు పెద్దలు. అది కాకా పోయినా, కోటి విద్యలు కూటి కొరకే  అనే సామెతను అయితే అందరూ వినే ఉంటారు. అంటే..  బతుకు తెరువు కోసం అనేక వేషాలు వేయక తప్పదని అర్థం. ఆఫ్టరాల్  పొట్ట కూటి కోసమే ఎన్నో వేషాలు వేయక తప్పనప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే ఇంకెన్ని వేషాలు వేయవలసి ఉంటుందో వేరే చెప్ప నక్కర లేదు. అందులోనూ.. కాలం కలసి రానప్పుడు, కష్టాలు చుట్టిముట్టినప్పుడు రాజకీయ నాయకులు అవసరార్ధం వేషాలు మార్చక తప్పదు.. ఇప్పడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినాయకురాలు కవిత పరిస్థితి కూడా అదే. అందుకే, ఆమె పంతులమ్మ వేషం కట్టారని అంటున్నారు.

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.