LATEST NEWS
  సింగపూర్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి పెట్టుబడుల రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నామని ఎక్స్ వేదికగా సీఎం తెలిపారు. అభివృద్ధిలో తమకు అత్యంత విలువైన భాగస్వామి, శక్తిమంతమైన తెలుగు సమాజానికి నెలవుగా ఉన్న దేశం సింగపూర్ అని కొనియాడారు. "రేపు సింగపూర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పొరా సభ్యులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో సింగపూర్ ఒక కీలక భాగస్వామిగా ఉంది.  ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, దార్శనిక దేశంగా సింగపూర్ వర్థిల్లుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లోతైన సహకారం దిశగా విలువైన అవకాశాలను అందిస్తుంది. మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి, నూతన ప్రగతిశీల విధానాలను చాటిచెప్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, సమ్మిళిత వృద్ధి దిశగా శాశ్వత సహకారాలను నెలకొల్పేందుకు ఇదొక అవకాశం" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  చంద్రబాబు బృందం సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి  సింగపూర్‌కు ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, ఉన్నతాధికారులు  వెళుతున్నారు. 
  సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన  మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్‌ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో కఫుల్స్ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు.  ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది.  ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరుచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్ట్‌లు చేయించడంతో కాన్యర్స్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ కాన్యర్స్ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది.  పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి కూడా సరిపోలలేదు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
  ఏపీలో మావోయిస్టు అగ్ర దంపతులు  సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు.  మావోయిస్టు పార్టీ వైఫల్యాలు మరియు కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు చెప్పారు. చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారు. కమలేష్ పై ఆంధ్రా ప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు మరియు అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశాంఅల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుంది.  వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి - 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు,  ఇతర పరికరాలు ఉన్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌లు చేస్తున్నారని డీజీపీ  తెలిపారు. మావోయిస్టు లుగా ఉన్న వారు పునరాలోచన చేయండి హింసాత్మక ఘటనలు తో సాధించేదేమీ లేదు. మన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు  గురించి అయినా ఆలోచనలు చేయండి. మీరు జన జీవన స్రవంతి లోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ తెలిపారు.  
  ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆఫీస్, భారతి సిమెంట్స్ కార్యాలయం, నానక్‌రామ్ గూడలోని చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.  మద్యం కుంభ కోణ నిందితులు ఎక్కడ సమావేశమయ్యారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే స్కామ్‌కు ముందు వీరు ఎన్ని సార్లు భేటీ అయ్యారనే అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది.  పలు సాంకేతిక ఆధారాలతో ఈ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు రికార్డులను కూడా పరిశీలించారు. తదుపరి చర్యలపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారుల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం జైలుకు పంపారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పటికే పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చేసిన ఈ రైట్స్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది
  తెలంగాణ  జాగృతి సంస్థను రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆగస్టు 6న ప్రొ.జయశంకర్  జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు.  ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే నాయకుడు లక్షణమని తెలిపారు.‘‘ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప.. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడని ఆమె అన్నారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది.  తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ లాంటిది.  తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది. నాడు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుపడ్డాం, నేడు బనకచర్ల లింక్ ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని కచ్చితంగా ఆపి తీరుతామన్నారు. తెలంగాణ వనరులు, సాంస్కృతి పరిరక్షించడమే ఆలోచనగా జాగృతి పనిచేస్తుందని కవిత వెల్లడించారు.
ALSO ON TELUGUONE N E W S
  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాటలు ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంటాయి. తాజాగా 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా విజయ్ స్పీచ్ కాంట్రవర్సీ అవుతోంది. తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. కొన్ని కాంట్రవర్సీ అయ్యే కామెంట్స్ చేశాడు. (Kingdom Trailer)   "గత ఏడాది నుండి 'కింగ్‌డమ్' గురించి గానీ, సినిమా రిలీజ్ గురించి గానీ ఆలోచిస్తుంటే నా తలకాయలో ఒకటే తిరుగుతాంది. నా మనసులో ఒకటే గట్టిగా అనిపిస్తాంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ ఈ ఒక్కసారి  నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. శానా పెద్దోడినై పూడుస్తాను సామి. టాప్ లో పోయి కూసుంటా." అని విజయ్ అన్నాడు. తాను టాప్ లోకి వెళ్లాలని ఆశపడటంలో తప్పులేదు కానీ.. ఆ తర్వాత విజయ్ మాట్లాడిన మాటలే వివాదాస్పదమవుతున్నాయి.    "ఆ వెంకన్న సామి దయ, మీ అందరి ఆశీస్సులు.. ఈ రెండు నాతో పాటు ఉంటే.. వానెక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే." అని విజయ్ అన్నాడు. తిరుపతి వెంకన్న సాక్షిగా జరిగిన ఈవెంట్ లో "వానెక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే." అని విజయ్ స్టేట్మెంట్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.   
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'హరి హర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు ప్రదర్శించబోతున్నారు.   దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం డిప్యూటీ సీఎం పవన్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు. వారాంతపు సెలవు దినాలు అయిన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు.    కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు.  
  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. 'SSMB29' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'SSMB29' అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.   రాజమౌళి తన గత సినిమాలకు భిన్నంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండానే 'SSMB29' షూట్ మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంతవరకు సినిమా నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రాలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో ఆరోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. గ్లింప్స్ విడుదల ఉంటుందని అభిమానులు భావించారు. అయితే మహేష్ బర్త్ డేకి ఎటువంటి అప్డేట్ ఉండదని తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ కి ఇంకా టైం తీసుకోబోతున్నారని సమాచారం. ఓ రకంగా ఇది ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. అయితే 'SSMB29' గ్లింప్స్ ఎప్పుడు విడుదలైనా.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయమని అంటున్నారు.  
Under the banners of Tejas Gunjal Films and Rohit Gunjal Films, the action-packed crime drama One/4 is ready to hit the big screens this September. The film stars Venkatesh Peddapalem, Aparna Mallik, and Heena Soni in the lead roles. One/4 is directed by Bahubali Palani K, who previously worked as an associate director on the blockbuster “Baahubali.” The project is jointly produced by Ranjan Rajesh Gunjal and Rohit Ramdas Gunjal. Having completed both its shoot and post-production, the first copy of One/4 is now ready. After finishing its censor formalities, the team is preparing for a grand theatrical release in September. Speaking about the film, the director and producers shared, “One/4 is an action crime drama, with the entire shoot taking place in Vizag. Our story revolves around the consequences of a single slip of the tongue, and the struggles that follow. It’s a fresh, engaging narrative packed with thrilling elements and intense crime-action sequences.” They added, “We have already released the teaser and songs on T-Series’ YouTube channel, which received a tremendous response. We promise a unique and crazy experience for the audience and will release the film in September.”
గత ఏడాది రిలీజ్‌ అయి సంచలనం సృష్టించిన ‘కల్కి 2898ఎడి’ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాల్లో మొదట మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరోపక్క హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌ కూడా జరుగుతోంది. ఈ సినిమాలు ఇలా ఉంటే.. అందరి దృష్టీ సందీప్‌ వంగా కాంబినేషన్‌లో చేయబోతున్న ‘స్పిరిట్‌’పైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి బయట వినిపిస్తున్న వార్తలే తప్ప అఫీషియల్‌గా ఏదీ బయటికి రాలేదు. తాజాగా దర్శకుడు సందీప్‌ ‘స్పిరిట్‌’కి సంబంధించి ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చారు.  విజయ్‌ దేవరకొండతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చేసిన సందీప్‌.. ఇప్పుడు విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌’ ప్రమోషన్స్‌లో అతనికి హెల్ప్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్పిరిట్‌ మూవీ అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. సెప్టెంబర్‌ చివరి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది స్పిరిట్‌ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అర్జున్‌రెడ్డి, యానిమల్‌ చిత్రాలతో ప్రేక్షకులకు ఒక పవర్‌ఫుల్‌ కిక్‌ ఇచ్చిన సందీప్‌.. ప్రభాస్‌తో చేసే స్పిరిట్‌తో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే స్పిరిట్‌ కూడా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.  రాజాసాబ్‌, ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాలే కాకుండా సలార్‌2, కల్కి2 చిత్రాలు కూడా ప్రభాస్‌ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత సలార్‌2 గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇక కల్కి2 గురించి ఎలాంటి న్యూస్‌ బయటికి రాలేదు. దానికి సంబంధించి ఎలాంటి వర్క్‌ జరుగుతోంది అనే విషయంలో కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఏది ఏమైనా సినిమాలు పూర్తి చేసే విషయంలో ప్రభాస్‌ ఎంతో దూకుడుగా ఉన్నాడని మాత్రం అర్థమవుతోంది. తను కమిట్‌ అయిన సినిమాలను జెట్‌ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో డైరెక్టర్లకి తన ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. 
  కరోనా తరువాత నాన్-థియేట్రికల్ బిజినెస్‌ పై మేకర్స్ ఎక్కువ ఆధారపడుతున్నారు. అయితే ఈమధ్య నాన్-థియేట్రికల్ బిజినెస్ అనేది చాలా కష్టమైపోయింది. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో నారా రోహిత్ నటిస్తున్న 'సుందరకాండ' మూవీ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.   'సుందరకాండ' సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో రూ. 12 కోట్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ రూ.9 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్‌ రూపంలో మరో రూ. 3 కోట్లు వచ్చాయి. దీంతో నాన్-థియేట్రికల్ ద్వారా ఏకంగా రూ.12 కోట్లు సాధించింది సుందరకాండ.   ఈ సినిమాను హాట్ స్టార్ కు చెందిన మూడు టీమ్స్ చూసి మరీ కంటెంట్ బాగా నచ్చడంతో మంచి రేటుకు తీసుకున్నారట. దీంతో సుందరకాండ కంటెంట్ ఆ రేంజ్ లో ఉందా అనే ఆసక్తి నెలకొంది.    నారా రోహిత్ కు 20వ చిత్రం కాగా, ఈ సినిమా ద్వారా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి దీనిని నిర్మిస్తున్నారు. సుందరకాండ ఆగస్టు 27న విడుదల కానుంది.   
Silambarasan aka STR, has suddenly locked his next with Vetrimaaran. Also, the movie story has deep connection with Vada Chennai, the cult classic of Vetrimaaran with Dhanush. As this movie promo shoot has been completed, many of actor fans have been waiting to hear positive updates regarding the film.  But suddenly, the rumors about film will be canceled or postponed indefinitely like Vaadivaasal have been going around. While the team have been silent about such reports, it is stated that STR has asked for 50 crores remuneration and producer S. Thanu asked him to accept Rs.20 crores plus profit share, deal it seems.  Currently, the reports suggest that team is putting up a set in popular studio in Chennai and the movie is not canceled or postponed. While there might have been negotiations with the producer for STR, he doesn't want to give up on this film with such a popular and quality director, that too, linked with popular franchise.  At the moment, the set works regarding the film are going on say reports but if these negotiations about remuneration doesn't come to a conclusion by 15th August, the movie could be canceled or postponed indefinitely. Well, producer Thanu, had already spent too much on Vaadivaasal and hence, he wants this movie to go on sets, come what may, it seems. Let's wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. జానర్, కంటెంట్ తో సంబంధం లేకుండా.. ఆయన సినిమాలకు సంచలన ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఆ విషయం 'హరి హర వీరమల్లు' చిత్రంతో మరోసారి రుజువైంది. ఫస్ట్ డే ఈ మూవీ పవన్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే సెకండ్ డే కలెక్షన్స్ మాత్రం ఊహించని విధంగా ఉన్నాయి.   'హరి హర వీరమల్లు' విడుదల తేదీ జూలై 24 కాగా, జూలై 23 రాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ప్రీమియర్ షోలు మాత్రమే కాదు.. మొదటిరోజు కూడా థియేటర్లు కళకళలాడాయి. ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.39 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే రెండో రోజు మాత్రం ఎవరూ ఊహించనివిధంగా అందులో పది శాతం మాత్రమే రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. రెండు రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల లోపు షేర్ కే పరిమితమైందని అంటున్నారు.    'హరి హర వీరమల్లు' కలెక్షన్స్ లో ఈ రేంజ్ డ్రాప్ కనపడటానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సెకండాఫ్ తేలిపోయిందని, వీఎఫ్ఎక్స్ బాలేదనే కామెంట్స్ వినిపించాయి. దానికి తోడు టికెట్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు, నెలాఖరు కావడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ వెనుకాముందు ఆడుతున్నారు. ఇది చాలదు అన్నట్టు ప్రస్తుతం తెలుగునాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవన్నీ కలిసి 'వీరమల్లు' రెండో రోజు కలెక్షన్స్ పై ప్రభావం చూపాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. శని, ఆదివారాలు మెరుగైన వసూళ్లు వచ్చే అవకాశముందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   
Vijay Deverakonda is working non-stop to promote his upcoming biggie, Kingdom. The movie is scheduled for 31st July release and the makers have decided to release trailer on 26th July. They are conducting trailer launch event in Tirupathi. But the regional ST leaders are opposing the event.  As per the reports, earlier Vijay Deverakonda made some controversial comments against Tribal people, equating them to terrorists. Hurt by his statements, they are boycotting the event and are protesting against the makers entering Tirupathi, to conduct it, this evening.  The makers are planning silently, the event amidst these protests and it is heard that they have planned a short length event as 28th there will be a huge Pre-release event where several chief guests might also participate. On the other hand, Vijay commented that he is looking to spend more time with his family and girl friend.  For so many days, he had been denying being in a relationship but Rashmika Mandanna and Vijay have been reportedly dating since 5 years, after their Geetha Govindam film. While he did not confirm this relationship but making a statement that he is unable to spend time with girlfriend is going viral. Gowtam Tinnanuri has directed the movie and Anirudh Ravichander composed music for it. Already, Anna Antene song has become viral hit.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఒకప్పుడు సినిమాలన్నీ నేచురల్‌ లొకేషన్స్‌లో ఉండేవి. ఫైట్స్‌ కూడా అదే పద్ధతిలో తీసేవారు. కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి సీన్‌ని ఎంతో కేర్‌ఫుల్‌గా, విజువల్‌ వండర్‌లా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. సీజీ వర్క్‌పైనా, విఎఫ్‌ఎక్స్‌పైనా ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. కొన్ని జోనర్స్‌కి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనేవి తప్పనిసరిగా మారాయి. ఈమధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇంతకుముందు గ్రాఫిక్స్‌ వర్క్‌, విఎఫ్‌ఎక్స్‌ గురించి సాధారణ ప్రేక్షకులకు అంతగా అవగాహన ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అందుబాటులో వున్న మాధ్యమాల ద్వారా వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు ప్రేక్షకులు. విఎఫ్‌ఎక్స్‌లో చిన్న తేడా కనిపించినా ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. దాన్ని వైరల్‌ చేసేస్తున్నారు.  తాజాగా పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై చాలా విమర్శలు వచ్చాయి. విఎఫ్‌ఎక్స్‌ వల్ల సినిమాకి చాలా బ్యాడ్‌ జరిగిందనే ప్రచారం ఎక్కువైంది. సాధారణ ప్రేక్షకులు సైతం దాన్ని గుర్తించారు. దీంతో చిరంజీవి తాజా చిత్రం విశ్వంభరపై ఆ ఎఫెక్ట్‌ పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్‌ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంది. దాన్ని మేకర్స్‌ కూడా గుర్తించి.. మంచి క్వాలిటీతో విఎఫ్‌ఎక్స్‌ చేయిస్తున్నామని ప్రకటించారు. దానివల్లే సినిమా రిలీజ్‌ కూడా లేట్‌ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను టీజర్‌ తలక్రిందులు చేసిందనేది వాస్తవం.  చిరంజీవి, మౌనిరాయ్‌పై చిత్రీకరించిన స్పెషల్‌ సాంగ్‌తో విశ్వంభర షూటింగ్‌ పూర్తయింది. ఓ పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. విఎఫ్‌ఎక్స్‌ విషయంలో హరిహర వీరమల్లు చిత్రం ఎదుర్కొన్న విమర్శలు రిపీట్‌ కాకుండా ఉండాలని దర్శకనిర్మాతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే టీజర్‌ వల్ల వచ్చిన విమర్శ నుంచి బయటపడాలంటే క్వాలిటీగా చేసిన విజువల్స్‌ని రిలీజ్‌ చెయ్యాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా విశ్వంబర మేకర్స్‌ ఆలోచన చేస్తే బాగుంటుందనేది బయటి వినిపిస్తున్న మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎంతో గొప్పగా ఉంటే తప్ప ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టం. దీంతో విశ్వంభర టీమ్‌కి ఈ విషయంలో బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం చిరంజీవి.. విశ్వంభరతోపాటు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాను పూర్తి చేసే విషయంలో అనిల్‌ రావిపూడి స్పీడ్‌ అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మూడు షెడ్యూల్స్‌ పూర్తి చేశారు. వరస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్‌ రావిపూడిపై అందరకీ కాన్ఫిడెన్స్‌ ఉంది. దీంతో విశ్వంభర కంటే అనిల్‌ రావిపూడి సినిమాపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. విశ్వంభర చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్ ని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి కార్గిల్ విజయ్ దివస్ ను ఒక పండుగలా జరుపుకుంటు ఉంటాం.  అయితే ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన భారత సైనికుల  దేశభక్తికి, సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచే ఒక మహత్తరమైన రోజు. విజయ్ దివస్.. ఆవిర్భావం.. 1999లో భారత దేశానికి సంబంధించిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్ లోయలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు,  ముష్కరులు, భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారిని వెనక్కు తోసి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత సైన్యం అసాధారణమైన ధైర్యాన్ని, ఓర్పును ప్రదర్శించింది. ఈ యుద్ధాన్ని మనం కార్గిల్ యుద్ధం గా గుర్తించాము. సుమారు 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న భారత విజయం సాధించడంతో ముగిసింది. అందుకే ఆ రోజును “విజయ్ దివస్”గా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దం.. ఒక సాహస గాథ.. కార్గిల్  యుద్ధంలో భారత సైనికులు ఎంతో కష్టసాధ్యమైన పర్వత ప్రాంతాల్లో పోరాడారు. కొండలపై దాక్కున్న శత్రువును తలకిందులు చేసి తామే పైచేయి సాధించడం అంటే సాహసానికి పరాకాష్ట.  ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ అనోజ్ థాపా, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, నాయిక్ సాయి సానూ లాల్, వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఎందుకు జరుపుకోవాలి? కార్గిల్ విజయ్ దివస్‌ను మనం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే: దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించటం యువతలో దేశభక్తిని ప్రేరేపించటం సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుని గర్వించటం మనం ఏమి చేయగలం.. మౌనంగా రెండు నిమిషాలు నిలబడి వీరులకు నివాళులర్పించవచ్చు.  పిల్లలకి, స్నేహితులకు కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా చెప్పి వారిలో చైతన్యం కలిగించవచ్చు. దేశ భద్రతలో భాగమైన సైనికుల సేవలకు కృతజ్ఞతలు తెలపచ్చు. కార్గిల్ విజయ్ దివస్  అందరికీ ఇచ్చే సందేశం..  స్వేచ్ఛ విలువైనదని, అది ఎప్పటికీ తీసుకోలేనిదాని ఆ రోజు దేశ ప్రజలకు చెప్పకనే చెబుతుంది. మన దేశ సైనికుల ధైర్యం, పట్టుదల కారణంగానే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాము. ఈరోజు వారిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత.                                         *రూపశ్రీ.
  ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే... విశ్వాసం పెరిగితే నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు. కారణాన్ని గ్రహించండి ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది. వయసుని బట్టి అబద్ధం ‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు. విలువలు తెలిస్తే సరి నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది? సమయం కేటాయించాలి పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది. అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. - నిర్జర.
తల్లి కావడం అనేది ప్రతి స్త్రీకి అత్యంత సంతోషకరమైన,  బాధాకరమైన అనుభూతి. వారి స్వంత జీవితాన్ని పక్కన పెడితే, మహిళలు కొత్తగా ఒక  చిన్న జీవితానికి ప్రాణం పోస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రసవం తర్వాత వారి జీవనశైలి, దుస్తులు ధరించడం,  జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తల్లి అయిన మహిళలకు  కుటుంబ మద్దతు చాలా అవసరం అవుతుంది.   ప్రతి తల్లి తన బిడ్డ గురించి చాలా భావోద్వేగంగా,  సున్నితంగా ఆలోచిస్తుంది. కొంతమంది దీనిని అర్థం చేసుకోలేరు. దీని కారణంగా చాలా సార్లు ప్రజలు తెలియకుండానే తల్లుల భావాలను దెబ్బతీసే  మాటలు అంటుంటారు. బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ ముందు ఎవ్వరూ పొరపాటున కూడా మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లవాడు ఏడుస్తున్నాడు, సరిగ్గా చూసుకో.. నీ బిడ్డ ఏడుస్తున్నాడు,  బిడ్డను సరిగ్గా చూసుకో అని ఎప్పుడూ తల్లికి చెప్పడం మంచిది కాదు.  రాత్రిపూట పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు  తరచుగా ఇలా అంటారు. ఇలా చెప్పడం సులువే.. తామేదో గొప్ప జాగ్రత్త చెప్పాం అనుకుంటారు. కానీ ఈ విషయం ఆ స్త్రీ యొక్క మాతృత్వ సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. బిడ్డ ఏడుపుతో ఎక్కువగా బాధపడేది తల్లి. అటువంటి పరిస్థితిలో పిల్లవాడిని ఊరుకోబెట్టడంలో  ఆమెకు మద్దతు ఇవ్వాలి తప్ప  పొరపాటున కూడా ఆమెను విమర్శించకూడదు. నీకు పిల్లవాడిని చూసుకోవడం చేతకాదు.. పిల్లవాడిని స్నానం చేయించడం నుండి పిల్లాడిని రెడీ చేసి,  పాలిచ్చి నిద్రపుచ్చడం వరకు ప్రతి స్త్రీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు స్త్రీలు చాలా కాలం తర్వాత కూడా బిడ్డను ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోలేరు.  వార గందరగోళానికి గురవుతూ ఉంటారు.  ఇలాంటి  సమయంలో కుటుంబం వారికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి తల్లి నేర్చుకునే ప్రయాణం భిన్నంగా ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో వారి సామర్థ్యాన్ని ప్రశ్నించే బదులు, వారికి మద్దతు ఇవ్వడం మంచిది. బిడ్డను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకుని చెడగొడుతున్నావు.. తల్లి,  బిడ్డల మధ్య స్పర్శ బిడ్డకు బంధం ,  భద్రతకు ఒక మార్గం. ఇది ఏ రకమైన "చెడు అలవాటు" కాదు. కాబట్టి బిడ్డను ఎప్పుడూ  చేతుల్లోనే ఉంచుకోవద్దని తల్లికి ఎప్పుడూ చెప్పకండి. బిడ్డకు తల్లి ఒడిలో అత్యంత సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ మాత్రం దానికే అలసిపోతావా? తల్లి అయిన తర్వాత బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి స్త్రీకి పూర్తి సమయం ఉద్యోగంగా మారుతుంది.  అది ఆమె నిర్వర్తించాల్సిన విధి కూడా. చిన్న పిల్లలు రాత్రంతా ఏడుస్తారు, అలాంటి పరిస్థితిలో  తల్లులు  రాత్రి నిద్రపోలేరు. అలాంటి పరిస్థితిలో నువ్వు బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం, నువ్వు ఎందుకు అంత అలసిపోతావు అనడం చేయకూడదు.  అది వాళ్ళని చాలా బాధపెడుతుంది. ప్రారంభ రోజుల్లో, ప్రతి తల్లి తనకోసం అరగంట కూడా కేటాయించుకోలేకపోతుంది.                          *రూపశ్రీ.  
మన మెడలోని థైరాయిడ్ గ్రంథి ఒక చిన్న అవయవం.  కానీ ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు,  శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజంలో సమస్యలు ఎక్కువ.  మందులతో పాటు, థైరాయిడ్ రోగులకు సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైనవి అనుకునే కొన్ని  కూరగాయలు థైరాయిడ్ సమస్యలను పెంచుతాయి. థైరాయిడ్ రోగులు ఏ కూరగాయలను తినకూడదు ? తెలుసుకుంటే.. క్యాబైజీ కుటుంబానికి చెందిన కూరగాయలు.. థైరాయిడ్ రోగులు కొన్ని కూరగాయల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిని గోయిట్రోజెనిక్ అంటారు. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకునే సమ్మేళనాలు. థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ,  బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పచ్చగా వద్దు.. పైన చెప్పుకున్న  కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, థైరాయిడ్ రోగులు వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వాటికి అధిక గైట్రోజెనిక్ లక్షణాలు ఉంటాయి.  వాటిని ఉడికించి తినేటప్పుడు ఈ సమ్మేళనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి  థైరాయిడ్  ఉన్నవారు ఈ కూరగాయలను తినాలనుకుంటే, వాటిని ఎల్లప్పుడూ బాగా ఉడికించి,  పరిమిత పరిమాణంలో తినాలి.  వాటిని రసం రూపంలో లేదా పెద్ద పరిమాణంలో పచ్చిగా తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నిపుణుల సలహా.. పైన పేర్కొన్న కూరగాయలతో పాటు, సోయా ఉత్పత్తులు కూడా గైట్రోజెనిక్ కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ రోగులు వాటిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  గ్లూటెన్ వినియోగం కూడా కొంతమంది థైరాయిడ్ రోగులకు, ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. ఆహారం మాత్రమే థైరాయిడ్‌ను నయం చేయదని, అది మందులతో పాటు మాత్రమే సహాయపడుతుందని అర్థం చేసుకోవడం ముఖ్యం.  థైరాయిడ్ ఉన్నవారు ఎల్లప్పుడు వైద్యుడిని లేదా డైటీషియన్ ను కలిసిన తరువాత మాత్రమే ఆహారం తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.  ఏదైనా కూరగాయలను పూర్తిగా ఆపడం లేదా  స్వంతంగా ఏదైనా పెద్ద ఆహార మార్పులు చేయడం చేయకూడదు. ఎందుకంటే ఇది ఇతర పోషకాల లోపానికి దారితీస్తుంది.                                 *రూపశ్రీ.  
  భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు.  రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే  ఒకటి,  రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి..  హైడ్రేషన్.. లెమన్ టీ  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి,  శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం. లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,  ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం,  మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, బరువు.. ఎక్కువగా  జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్  టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.  కడుపు నిండిన  ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల  అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు. చర్మం.. లెమన్  టీ  అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం,  ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు..  మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది.   ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన,  వేడిగా ఉండే లెమన్  టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్,  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి,  చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
   భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో  పూరీలు,  స్టఫ్డ్ చేసిన పరాఠాలు  చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు.  కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్.. ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు,  రసాయన ప్రజర్వేటివ్స్  ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  ఊబకాయం,  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..  పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.  గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.  ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె,  సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే  అది  కడుపు  జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిగిలిన కూరలు లేదా కూరగాయలు.. చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన  కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు  దారితీస్తాయి. అధిక ఉప్పు లేదా ఊరగాయ.. కొంతమంది  ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం,  అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..