మళ్లీ వలసలు షురూ!.. బీఆర్ఎస్ కు ఇక దబిడి దిబిడే.. విపక్ష హోదా హుళక్కే!?

Publish Date:Aug 13, 2024

Advertisement

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్ధితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు కార్యకర్తలతో మమేకమౌతో, అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ చురుకుగా కనిపిస్తున్నా, అధినేత క్రియాశీలంగా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎలా అయితే ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేయడానికి వలసలకు పార్టీ తలుపులు బార్లా తీశారో.. ఇంచుమించు అదే విధంగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరే వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ తో ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వారి రాజీనామాలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ డిమాండ్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిందిదేగా అంటూ జనం కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను లైట్ గా తీసుకుంటున్నారు. ఇక కోర్టును ఆశ్రయించడం ద్వారా బీఆర్ఎస్ సాధించగలిగేది పెద్దగా ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలో కోర్టులు నిర్దేశించజాలవు. దీంతో  అనర్హత వేటు విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు. 
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు నెమ్మదించాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సెటిల్ అవుతోందన్న భావన విపక్షాలలో కలిగింది. అయితే మళ్లీ హఠాత్తుగా కనీసం ఆరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు తెలంగాణ రాజకీయాలలో మరోసారి సెగపుట్టించాయి.రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత మళ్లీ వలసల జోరు పెరుగుతుందంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ అరడజను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారనీ, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగా రాగానే ఈ వలసలు ఉంటాయని బీఆర్ఓస్ వర్గాలే చెబుతున్నాయి. 
వాస్తవానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకోవడం వెనుక నీవునేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చిన్న రివెంజ్ ఉన్నప్పటికీ ..అంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అంటూ కేసీఆర్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 దానం నాగేందర్ తో మొదలై ఇప్పటి వరకూ విడతల వారీగా ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ టార్గెట్ మరో పదహారు మంది అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా  పెట్టుకున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్న చందంగానే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని భావించిన రేవంత్ ఆ దిశగా పావులు కదిపారు. అయితే కారణాలేమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు అది జరగలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు తలుపులు తెరవడానికి రెడీ అయ్యారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత రేవంత్ అదే పని మీద ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేని గ్రేటర్ హైదరాబాద్, శివారు నియోజకవర్గాలపైనే రేవంత్ రెడ్డి  దృష్టి పెట్టారని అంటున్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మరో అరడజను మంది కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు.  మరో పదిమందిపైనా రేవంత్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టనున్నట్లు చెబుతున్నారు. 

అయితే అలా వచ్చి చేరేవారికి మంత్రి పదవుల హామీ ఇవ్వలేనని రేవంత్ ముందుగానే చెప్పేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక రార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు మాత్రం రేవంత్ సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.