అయ్యా కొడుకులకి అండర్‌స్టాండింగ్ లేనట్టుంది!

Publish Date:Aug 13, 2024

Advertisement

ఆత్రంగా అవినీతి చేయడం తప్ప అయ్యా కొడుకులు జోగి రమేష్, జోగి రాజీవ్ మధ్య సరైన అండర్‌స్టాండింగ్ లేనట్టుంది. పాపాలు పండి దొరికిపోయినప్పుడు తోడుదొంగలు ఇద్దరూ ఒకేమాట చెప్పాలన్న కనీస పరిజ్ఞానం వీళ్ళకి లేనట్టుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో జోగి రమేష్ పుత్రరత్నం జోగి రాజీవ్‌ని పోలీసులు అరెస్టు చేసినప్పడు జోగి రమేష్ ఆవేశంగా రోడ్డు మీదకి వచ్చి ‘‘అటాచ్‌మెంట్‌‌లో వున్న భూములని ఎవరైనా కొంటారా?’’ అని ఆవేశంగా ప్రశ్నించారు. ఈ వైసీపీ వాళ్ళ బుద్ధులు తెలియనివాళ్ళు ఎవరైనా జోగి రమేష్ ఆవేశం చూశారంటే, తండ్రికొడుకులిద్దరూ అమాయక చక్రవర్తులు అని పొరపడే అవకాశం వుంటుంది. కానీ, వీళ్ళ జాతకం అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ అలా అపోహ పడే అవకాశం లేదులెండి. రోడ్డు మీద తండ్రి ఇలా ఆవేశంగా ప్రశ్నించాడా? పోలీసుల కస్టడీలో వున్న జోగి రాజీవ్ తన దగ్గరకి వచ్చిన మీడియా ప్రతినిధులతో ‘‘అందరూ కొన్నట్టే మేమూ కొన్నాం... ఇందుతో తప్పేంటి’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. జోగి రమేష్ తన కొడుక్కి అవినీతి ఎలా చేయాలో నేర్పించాడుగానీ, దొరికిపోయినప్పుడు ఎలా మాట్లాడాలో చిలక పలుకుల్లాగా నేర్పించినట్టు లేడు.

అసలింతకీ ఏంటీ అగ్రిగోల్డ్ భూ కబ్జా భాగోతం? సింపుల్‌గా చెప్పాలంటే, అగ్రిగోల్డ్ స్కామ్‌కి సంబంధించిన భూమి సర్వే నంబర్ 87. ఈ సర్వే నంబర్లో భూమి అటాచ్‌మెంట్‌లో వుంది కాబట్టి దీనిని ఎవరూ కొనడానికి వీల్లేదు. మన జోగి రమేష్ ఏం చేశాడంటే, 87 సర్వే నంబర్ పక్కనే వున్న, ఎలాంటి వివాదాలు లేని 88 సర్వే నంబర్లో  భూమిని కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సర్వే నంబర్ తప్పు పడిందంటూ 88వ నంబర్ని 87వ నంబర్‌గా మార్చుకున్నాడు. ఈ రకంగా అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారు. కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని జోగి రమేష్ బినామీ అయిన వైసీపీ కార్పొరేటర్‌కి అమ్మేశారు. ఇంత జరిగింది!

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.