దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

Publish Date:Mar 21, 2026

Advertisement

 

 

హైదరాబాద్‌లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే మరో కీలక వివాదం తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ వ్యవహారంపై హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 11న స్పీకర్ ఇచ్చిన తీర్పులో దానం నాగేందర్ పార్టీ మారలేదని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు (క్వాష్) చేయాలని పిటిషన్‌లో కోరారు. 

గత ఏడాది ఏప్రిల్ 23న జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో దానం కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ తేదీ నుంచే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి వాదిస్తు న్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేగా దానం ఇప్పటివరకు పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయాలని కూడా తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరపనున్నది. తెలంగాణ హైకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా ద‌క్షిణాదిలో అత్యంత సంప‌న్న పొలిటీషియ‌న్ల‌లో విజ‌య్ కూడా ఒక‌రు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్‌ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.