మంత్రి నారాయణకు అస్వస్థత
Publish Date:Aug 24, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్‌కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరుపతి విమానాశ్రయంలోనే సీఎం కాన్వాయ్‌లో ఉన్న స్విమ్స్ వైద్యులు మంత్రికి అత్యవసర వైద్య సేవలు అందించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, గ్యాస్ట్రిక్ సమస్యతోనే వాంతులు అయ్యాయని వైద్యులు తెలిపారు. కోలుకున్న తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-narayana-ill-health-39-37565.html
http://www.teluguone.com/news/content/minister-narayana-ill-health-39-37565.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





