నారా వారి కుటుంబం: అందరూ సమానమే.. ఎవరి బాధ్యతలు వారివి.!

Publish Date:Nov 10, 2026

Advertisement

రాజకీయాలు  కుటుంబ సభ్యుల మధ్యే అడ్డంకులను సృష్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇందుకు  వైఎస్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం  ఉదాహరణలుగా చెప్పవచ్చు. కుటుంబంలోనే రాజకీయాలలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలూ, తగాదాలు, విభేదాలు. అటువంటి కారణాలతోనే కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు. 

సరిగ్గా అటువంటి తాగాదాలతోనే వైఎస్ రాజశఖరరెడ్డి కుమార్తె, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్నతో వేరుపడి సొంత బాటలో నడుస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఇగో సమస్యలు, పైచేయి కోసం ఆరాటాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.    సరిగ్గా ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ చెప్పారు.   తన తండ్రి, ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.. కుటుంబ సభ్యులందరికీ వారి వారి బాధ్యతలను స్పష్టంగా విభజించారు. తామందరం ఆయన మాటను శిరసావహిస్తున్నామని లోకేష్ ఆ ఇంటర్యూలో చెప్పారు.  

తమది  చాలా సన్నిహితమైన ఉమ్మడి కుటుంబమని వివరించిన నారా లోకేష్.. కుటుంబంలో, బంధాలు, బాధ్యతలు అన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటామన్నారు. చంద్రబాబుతమ బాధ్యతలను స్పష్టంగా విభజించారనీ, ఆ బాధ్యతలను తాము చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తున్నామనీ వివరించారు.  కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక విషయాలను చూసుకునే బాధ్యత బ్రహ్మణిది అని చెప్పిన లోకేష్, బ్రహ్మణి ఆరోగ్యం, ఆదాయం, వ్యయాలకు సంబంధిచిన వ్యవహారాలు పర్యవేక్షిస్తారనీ, ఇక అమ్మ భువనేశ్వరి  ఎన్టీఆర్ ట్రస్ట్‌ను నిర్వహిస్తారనీ చెప్పారు.  

కుటుంబ భద్రత, లాజిస్టికల్ వ్యవహారాలు, అలాగే రాజకీయ వ్యూహాలకు సంబంధించిన బాధ్యతలు తనపై ఉన్నాయని లోకేష్ చెప్పారు.  కుటుంబ సభ్యులందరికీ బాధ్యతలను సమానంగా విభజించడమే కాకుండా,   ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు. 

ఇది కూడా చదవండి: కనకదుర్గమ్మకి చంద్రబాబు కుటుంబం పట్టువస్త్రాల సమర్పణ!

 తమ కుటుంబంలో ఎలాంటి అభద్రతా భావాలు, ఈగో క్లాష్‌లు, అభిప్రాయ భేదాలకు తావులేకుండా మా మా బాధ్యతలకు కట్టుబడి   విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.   అన్ని వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత విషయాలను పరస్పరం పంచుకుంటామని వివరించారు.  ఈ కారణంగానే  కుటుంబంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సజావుగా సాగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబంలో ఎవరికి ఏ బాధ్యత ఎవరిదన్న  దానిపై  స్పష్టత ఉండటం వల్ల ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటామన్నారు.   రాజకీయ రంగంలో తాను బిజీగా ఉంటూనే, కుటుంబ పరమైన వ్యాపార వ్యవహారాలను, ఇతర సామాజిక కార్యక్రమాలను అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాజకీయాలతో పాటు కుటుంబ పరంపరను, వ్యాపారాలను ఒక క్రమపద్ధతిలో నడిపించడంలో చంద్రబాబు దూరదృష్టి ఎంతగానో దోహదపడుతోందని లోకేష్ చెప్పారు. 

రాష్ట్ర రాజకీయాలలో బిజీగా గడుపుతూనే కుటుంబ వ్యవహారాలను ఇంత పకడ్బందీగా సమన్వయం చేసుకోవడంపై నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు   రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ వ్యవస్థ పట్ల, బాధ్యతల పట్ల నారా కుటుంబం అనుసరిస్తున్న   విధానం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

మీకు నచ్చవచ్చు:  

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం

ది లెజండ్.. ది విజనరీ.. ది లీడర్.. ఒకే ఒక్కడు చంద్రబాబు 

[Nara Lokesh Family Responsibilities,  Chandrababu Naidu, Nara Brahmani, Nara Bhuwaneswari, Lokesh, Interview,  Politics And Family, Telugu One]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.