తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. "మీరు చెప్పిన అప్పుల లెక్కలే తప్పని తేలితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? లేక ప్రజలకు క్షమాపణ చెబుతారా?" అని మంత్రి ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా కూడా అప్పుల వివరాలను వారికి పంపించినట్లు తెలిపారు. "నేను ఎప్పుడూ తోక ముడవలేదు. వెనక్కి తగ్గే స్వభావం నాది కాదు.
ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ప్రజల ముందు నిజాలు బయటపెట్టడానికి ఎలాంటి చర్చకైనా సిద్ధమే" అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నేను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని రుజువు చేయండి. నా వాదన తప్పని నిరూపిస్తే ఇప్పటికీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను" అని జూపల్లి ప్రకటించారు. దీనిపై మాటల యుద్ధం కాకుండా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. మంత్రి విసిరిన ఈ సవాల్‌కు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-jupally-krishna-rao-36-224973.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్