తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌజ్ పర్యటనకు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంప్‌హౌజ్ వైపు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడుగడుగునా బారికేడ్లు, ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష శ్రేణులు మండిపడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు సాగిన కేటీఆర్ కాన్వాయ్‌ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిలిపివేశారు. హైవేపై భారీగా బారికేడ్లు ఉంచి కేటీఆర్ వాహనాలను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజాప్రతినిధుల పర్యటనను ఎలా అడ్డుకుంటారని గులాబీ నేతలు అధికారులను నిలదీశారు. పెంబర్తి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జాతీయ రహదారి ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది.
ఈ పర్యటనను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్‌లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, చివరకు కన్నెపల్లి పంప్‌హౌజ్ వైపు వెళ్తున్న రైతుల వాహనాలను సైతం పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ అధికారికంగా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పర్యటనలు చేసే హక్కును కూడా కాలరాస్తున్నారని, కన్నెపల్లి పంప్‌హౌస్ వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాచడానికే ప్రభుత్వం ఈ స్థాయి ఆంక్షలు విధిస్తోందని ఆరోపించింది. హైదరాబాద్-వరంగల్ హైవే పొడవునా పోలీసులు పహారా కాస్తుండటంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ పర్యటన ముగిసేవరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ktr-kaleshwaram-tour-36-225099.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.