సీఎం కుర్చీ కోసం జగన్ కుట్రలు.. ఓట్లు తొలగింపు
Publish Date:Mar 6, 2019
Advertisement
ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రపై వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. బుధవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు. ఫారం-7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైసీపీ పాల్పడుతోందని.. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీతో చేతులు కలిపి వైసీపీ అధినేత జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ అని దేవినేని విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘అధికారమే పరమావధిగా జగన్ మాట్లాడుతున్నారు. ఫారం-7 తానే దరఖాస్తు చేయించానని జగన్ ఒప్పుకున్నారు. జగన్ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో 24లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారు. నెల్లూరు సభలో జగన్ మాట్లాడిన భాష జుగుప్సాకరం. ఓ అజెండా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు’ అని ఉమ ధ్వజమెత్తారు.
http://www.teluguone.com/news/content/minister-devineni-uma-fires-on-jagan-over-form-7-39-86149.html





