కుమార్తె కోసం మంత్రి ఆనం ప్రణాళికలు...టీడీపీ క్యాడర్‌లో అసమ్మతి!

Publish Date:May 21, 2026

Advertisement

 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామనారాయణరెడ్డి, టీడీపీలోకి 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం, పదిహేనేళ్ల తర్వాత తిరిగి అక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ మంచి మెజార్టీతో గెలిచారు. 

గత ఎన్నికల్లో ఆయన విజయం కోసం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ కొమ్మి లక్ష్మయ్యనాయుడు, సీనియర్ టీడీపీ నేత గూటూరు కన్నబాబులు కృషి చేశారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ అయిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఆత్మకూరులోని తన సొంత మండలమైన మర్రిపాడులో ఆనం గెలుపు కోసం పనిచేశారట. ఇప్పుడా ముగ్గురూ ఆనం తిరిగి మంత్రి అయ్యాక ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఆ సీనియర్లు ఏకమై చక్రం తిప్పుతుడటం చర్చనీయాంశంగా మారింది.

రామనారాయణరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని ఆ సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబు వర్గీయుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయినా వారు టీడీపీ పట్ల లాయల్ గానే వ్యవహరిస్తున్నారు. 73 ఏళ్ల వయసు పైపడిన ఆనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని, అప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆ ఇద్దరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట. 

అయితే ఆనం రామనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కైవల్లారెడ్డిని ప్రకటించడం, ఆమె ఆత్మకూరు నియోజకర్గంలో యాక్టివ్ అవుతుండటం అసలు ముసలానికి కారణమైంది. ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగడంతో నారా లోకేష్ యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలిని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. 1983లో రామరాయణరెడ్డి తండ్ర ఆనం వెంకరెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది ప్రస్తావిస్తూ తాత వారసత్వాన్ని నిలబెట్టాలని రామనారాయణ కుమార్తెను గీతోపదేశం చేస్తున్నారట. 

వచ్చే ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి కైవల్య రెడ్డిని బరిలో దింపాలనే ఉద్దేశంతో  రామనారాయణరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తూ.. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీతో పాటు మేకపాటి వంశస్తులు కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబులతో జతకట్టి యాంటీ ఆనం గ్రూపు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. రామనారాయణ రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి జెండా మోసిన వారిని కాకుండా.. పార్టీ పిరాయింపుదారులకు ప్రాధాన్యత  ఇస్తున్నారని సీనియర్లు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం.. 

ఆనం అవినీతిపై రోడ్డు ఎక్కితే పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో తామంతా మౌనంగా ఉన్నామని ఆ ముగ్గురు నేతలు చెబుతున్నారట. తమ వెంట తిరిగే కార్యకర్తలకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదీకాక  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సొంత మండలమైన చేజర్ల, గూటూరు కన్నబాబు సొంత మండలం కరటంపాడు లో కూడా ఆనం వర్గమే ఆదిపత్యం చెలాయిస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందు ఆ ముగ్గురు సీనియర్ నేతలు కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారట. 

పార్టీ కోసం తాము చేసిన త్యాగాలను అధిష్టానం కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మంత్రి ఆనం మీద ఫిర్యాదు చేశారని వారి అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారి మండలాల్లో జరిగే కార్యక్రమాలకి కూడా మంత్రి ఆనం వారిని ఆహ్వానించడం లేదట. తమతో తిరిగితే పనులు కూడా చెయ్యనని తమ అనుచరులను ఆనం భయపెడుతున్నారని ఆ ముగ్గురు నేతలు రగిలిపోతున్నారట. ఆ ఎఫెక్ట్‌తో  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సహా ఆనంపై అసంతృప్తితో నేతలందరూ మేకపాటి శిబిరంలో చేరిపోతున్నారంట.  మరి కుమార్తె పొలిటికల్ కెరీర్ కోసం పాట్లు పడుతున్న ఆనం.. ఆత్మకూరులో ఈ వ్యతిరేక పరిస్థితులు ఎలా అధిగమిస్తారో చూడాలి.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.