యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలిగా మెగా స్టార్ సతీమణి!

Publish Date:Jun 30, 2026

Advertisement

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. యాదగిరి గుట్ట అభివృద్ధి,  పాలనను మరింత పటిష్టం చేసే దిశగా   నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ప్రపంచప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం  ) బోర్డు తరహాలోనే, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కమిటీని రూపొందించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 18 మంది సభ్యులతో ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. 

 నూతన పాలక మండలి బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త, ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌  సీఎండీ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి రెండు పీహెచ్‌డీలు అందుకున్న విద్యాధికుడు, వ్యాపారవేత్త   మన్నె సత్యనారాయణ రెడ్డి గతంలో మహబూబ్‌నగర్‌ ఎంపీగా పనిచేసిన మన్నె శ్రీనివాస్‌రెడ్డికి స్వయానా సోదరుడు కావడం గమనార్హం.  

ఇక ఈ బోర్డులో మెగాస్టార్, ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేఖ నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సురేఖతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి,  చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు లింగయ్య, స్వాతి కాంతమణి, ఎం.రాఘవేంద్ర రావు, డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్ , ఆలయ ఫౌండర్‌ ట్రస్టీలు  సభ్యులుగా నియమితులయ్యారు. 

ఈ 18 మందితో కూడిన కమిటీలో కేవలం ప్రజాప్రతినిధులు, ప్రముఖులే కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఎక్స్-అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ  వైస్ ఛైర్మన్,  ఆలయ కార్యనిర్వహణాధికారి  ఈ బోర్డులో ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు.  అధికారిక హోదాలో ఉండే ఎక్స్‌ అఫీషియో సభ్యులు, ఆలయ ఫౌండర్ ట్రస్టీలు మినహా, నూతనంగా నియమితులైన మిగిలిన బోర్డు సభ్యుల పదవీకాలం  రెండేళ్ల పాటు ఉంటుంది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఈ పాలకమండలి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఆలయ సంపదను రక్షించడం మరియు దివ్య క్షేత్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి నిరంతరం కృషి చేయనుంది.

By
en-us Political News

  
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.