ఓపెన్ ఏఐ సీటీవోగా ఉదయ్ రుద్రరాజు.!
Publish Date:Jul 20, 2026
Advertisement
ఓపెన్ ఏఐ సీటీవోగా హైదరాబాద్ టెక్కీ నియమితుడయ్యారు. ఐఐటీ, ఎన్ఐటీ చదివితేనే.. గ్లొబల్ టెక్ దిగ్గజ సంస్థలలో అగ్రపీఠం సాధ్యమనే అపోహలకు ఈ కుర్రోడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. హైదరాబాద్ చైతన్య భారతి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఐబీటీ)లో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది. సీబీఐటీలో సీఎస్ఈ చదువుతూనే ఏడబ్ల్యూఎస్ లో ఇంటర్న్‌షిప్ సాధించి, మిన్నెసోటా వర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈబే, రాబిన్ హుడ్, అలాగే ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఎఎల్ లలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఉదయ్ రుద్రరాజు.. 2025 జులైలో ఓపెన్ ఏఐలో చేరి జిపిటి-5.6 వంటి నెక్స్ట్ జనరేషన్ ఏఐ మోడల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. Uday Ruddaraju, OpenAI CTO, CBIT Hyderabad, GPT 5.6, xAI Infrastructure, Indian Tech Leaders
http://www.teluguone.com/news/content/uday-ruddaraju-36-226558.html





