అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడున్నారు?.. జనసేన ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్
Publish Date:Aug 28, 2024
Advertisement
మెగా వర్సెస్ అల్లు వార్ ముదిరి పాకాన పడింది. ఇంత వరకూ రెండు కుటుంబాలకు చెందిన వారి మధ్య మాత్రమే నడిచిన మాటలయుద్ధం ఇప్పుుడు రాజకీయ వేదికలకూ పాకింది. అసలిదంతా ఎలా మొదలైందంటే.. ఎన్నికలకు ముందు వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి, ర్యాలీలో పాల్గొనడంతో ఆరంభమైంది. అప్పటి నుంచీ అల్లు అర్జున్ పై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉంది. మెగా అభిమానులు బన్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. నాగబాబు సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ పరోక్షంగా పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ.. ఇటీవల ఓ ఈవెంట్ లో నా ఫ్యాన్స్ అని నొక్కి చెప్పాడు. అలాగే నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తానంటూ తన నంద్యాల టూర్ ని సమర్ధించుకున్నాడు. దీంతో బన్నీపై మెగా అభిమానుల విమర్శలు మరింత పెరిగాయి. ఇలా రోజురోజుకి వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కదా.. దీనిపై మీ స్పందన ఏంటని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొలిశెట్టి శ్రీనివాస్ అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలియదు అంటూ బదులిచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా విడిపోయి షామియానా కంపెనీలాగా బ్రాంచ్ పెట్టుకున్నారేమో అని వ్యాఖ్యానించారు. అలాగే ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదు. బహుశా అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో అన్న బోలిశెట్టి శ్రీనివాస్ ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానులే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా ఇష్టమైతే వస్తా అన్న అల్లు అర్జున్ మాటలను ఉటంకిస్తూ అసలు ఆయనను రమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఒకటే అన్న బోలిశెట్టి, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేసిన చోట వాళ్లు ఓడిపోయారన్నారు. అంతెందుకు అల్లు అర్జున్ తండ్రి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వెళ్లి ఏం చేశారని ఎద్దేవా చేశారు. దీంతో ఇప్పుడు బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అల్లు ఫ్యామిలీ వార్ ఇప్పుడు మరంత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/mega-and-allu-war-intensify-39-183755.html





