మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ కోర్టు నోటీసులు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది.   కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు   కేసు విచారణకు సంబంధించి కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టు ద్వారా జారీ అయిన నోటీసులు కేసీఆర్‌కు సక్రమంగా చేరలేదని వెల్లడవ్వడంతో..  న్యాయస్థానం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  

గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి..   ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నోటీసుల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతివాదికి సమాచారం అందినట్లు రుజువులను న్యాయస్థానం ముందు ఉంచాన్నారు. పిటిషన్‌లో పేర్లు ఉన్న ప్రతివాదులందరికీ  నోటీసులు సమర్పించాల్సిన బాధ్యతను సంబంధిత యంత్రాంగానికి కోర్టు అప్పగించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో   నాణ్యతా లోపాలు జరిగాయని, అలాగే నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ గతంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఒక ప్రైవేట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో పిటిషనర్ రాజలింగమూర్తి అనారోగ్యంతో మరణించారు. దీంతో పిటిషనర్ మృతి చెందడం వల్ల ఈ కేసు విచారణ ఆగిపోతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ఈ అంశం తెలంగాణ హైకోర్టు దృష్టికి వెళ్లగా.. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో స్పష్టమైన తీర్పునిచ్చింది. ప్రజా ప్రయోజనాలు, ప్రాజెక్టు భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి పిటిషనర్ మరణించినప్పటికీ కేసు విచారణను  నిలిపివేయవద్దని, యథావిధిగా భూపాలపల్లి జిల్లా కోర్టులోనే కేసు విచారణను కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Medigadda Barrage Case, KCR Notices,  Bhupalpally Court,  Kaleshwaram Project Controversy Telangana News, TeluguOne

By
en-us Political News

  
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయ
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.