ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. ట్రాఫిక్ ఆంక్షలు
Publish Date:Aug 13, 2026
Advertisement
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్ పై నిర్వహించనున్న ‘తిరంగా ర్యాలీ’ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపం లోని ఎం-47 ప్యాటన్ ట్యాంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సెయిలింగ్ క్లబ్ వద్ద కర్బాలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌కు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించారు. వాటిని సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ్లించనున్నారు. అలాగే డీబీఆర్ మిల్స్ వద్ద నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమ తించకుండా గోశాల– కవాడిగూడ వైపు మళ్లి స్తారు. ఈ మళ్లింపుల కారణంగా సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ మార్గాలను వీలైనంత వరకు నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ర్యాలీ పూర్తయిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను తొలగించి రహదారులను సాధారణ రాకపోకలకు పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరా బాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. Tiranga Rally on Tank Bund on August 14, Hyderabad Traffic Police, Sailing Club, Telangana police, Hyderabad police, CP Sajjanar. DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/tiranga-rally-on-tank-bund-on-august-14-36-228884.html





