అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Publish Date:Jul 17, 2025

Advertisement

అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (జులై 16) మధ్యాహ్నం 12:37 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ భూకంపం వల్ల అలస్కా ప్రాంతంలో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలస్కాకు 20 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.  అలస్కా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.కాగా, తరచుగా భూకంపాలు వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ అలస్కా రాష్ట్రం ఉంది. ఇక్కడ తరచుగా భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. అయితే భారీ భూకంపం మాత్రం 1964లో వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 9.2 తీవ్రతో భూకంపం సంభవించింది ఆ విపత్తులో ఏకంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

By
en-us Political News

  
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.