తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత,  దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.   ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ,  వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.   తాజాగా  ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ..  నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.   బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా  ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే మరో అగ్రనటి   త్రిషపై  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో  ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు  ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  సినిమా రంగంలో తమకంటూ  గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ,   సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం  సరికాదని అంటున్నాయి.  కాగా ఎంపీ  షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్   సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రముఖంగా ఉండటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.  డగ్స్   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ క్రమశిక్షణ , ప్రతిష్ట   భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్ఠం చేశారు. మంగళవారం (మార్చి 17)  రాత్రి తిరుపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ప్రస్తావించారు. గత ఎన్నికలలో   రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పోరుగు రాష్ట్రంలో ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లినా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడటమేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.   ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిదే.   అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సాధారణంగా నేతల పట్ల సౌమ్యంగా ఉండే చంద్రబాబు, ఈ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా  తిరపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తెలుస్తోంది.  డ్రగ్స్ పరీక్షల్లో మహేష్ యాదవ్‌కు పాజిటివ్ రావడంతో  వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలోనే  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లే వారిని మోయాల్సిన అవసరం లేదని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించారని అంటున్నారు.  పార్టీ షోకాజ్ కు మహేష్ ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ పై తీసుకునే చర్య  ఇతర యువ నేతలకు ఒక హెచ్చరికలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, రాష్ట్రాలను ఏలారు. తమిళనాడులో ఎంజీఆర్, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో తమదైన ముద్ర వేశారు. వారి బాటలోనే తమిళ, తెలుగు హీరోయిన్లు పొలిటికల్ స్క్రీన్‌పై   మెరిసారు. ఎంజీఆర్ సన్నిహితురాలు జయలలిత ఆయన తదనంతరం ఏఐడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎం పీఠం అధిరోహించి చక్రం తిప్పారు.  తాజాగా  స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంటోంది.  జయలలిత, ఎం.జే.ఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని త్రిష చూస్తున్నారని తెలుస్తోంది.  తెలుగు, తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నది. ఇక ఇప్పుడు త్రిష రాజకీయ ప్రవేశం వెనక టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని  ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.  ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు  టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.  త్రిష కారణంగానే వారి పెళ్లి పెటాకులవ్వబోతోందన్నది ఓపెన్ సీక్రెట్టే.  విషయం ఓపెన్ అయి పోవడంతో..  నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. భార్య బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని ప్రజలకు స్పష్టం చేయడానికా అన్నట్లు... ఇటీవల ఓ పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.   హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.  సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో  చెన్నై పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది.  చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్ అసెంబ్లీ స్థానాల నుండి పలువురు నటీనటులు విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్,  తర్వాత జయలలిత,   మరో మాజీ సీఎం కరుణానిధి చెన్నై నగరం నుంచే గెలిచారు  ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ ఇవ్వని త్రిష, రానున్న ఎన్నికల్లో చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏఐడీఎంకే నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి త్రిష తమిళనాడు రాజకీయాల్లో మరో జయలలిత అనిపిం చుకుం టారో? లేకపోతే శశికళలా మిగిలిపోతారో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
Jio Studios and B62 Studios’ much-anticipated film about the unknown men, Dhurandhar The Revenge, releases into cinemas tomorrow, 19th March, with paid previews kicking off today and igniting a storm with early screenings! Ahead of the film’s massive release, director Aditya Dhar has earnestly requested the audience not to share spoilers after watching the high-stakes spy action thriller. Recalling the storm that Dhurandhar was, and one that’s about to unleash tomorrow, Aditya Dhar wrote in his latest social media post, “We've put our hearts into Dhurandhar The Revenge so you can experience every twist, every emotion, exactly the way it's meant to be felt. In a theatre, in the dark, surrounded by friends, family, and even strangers, everyone feeling the same emotions,” he wrote. “That's how films should be experienced. Not on someone's phone in blurry image. Hence, here is my one, heartfelt, earnest request...PLEASE DON'T SHARE SPOILERS! Let every single fan walk in clueless but curious and walk our with their own deeply personal version of what they felt,” he added. What adds to the sky-high curiosity is Aditya Dhar’s caption that certainly states You’re still NOT READY FOR THIS!  “Oh, and one more thing. Don’t leave your seats until the credits have stopped rolling 😉” https://www.instagram.com/p/DWBAY5xkcbO/
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం భారీ బడ్జెట్  విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్న మేకర్స్ రోజుకు కోటి నుండి కోటిన్నర వరకు ఖర్చు టికెట్ ధరల పెంపు లేకపోతే ఎలా? జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్'(Dragon) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా మేకింగ్, బడ్జెట్ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడటం లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ ఉగాది కానుకగా రేపు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని టికెట్ ధరల పెంపు అంశంపై మాట్లాడుతూ 'డ్రాగన్' మూవీ అప్డేట్ ఇచ్చారు. విజువల్స్ విషయంలో 'డ్రాగన్' ఒక అద్భుతంలా ఉండబోతోందని నవీన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతిరోజూ దాదాపు కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ విజన్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. టికెట్ ధరల విషయంలో కూడా నవీన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫ్లెక్సిబుల్ రేట్లు అందుబాటులో ఉన్నాయని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాంబే, ఢిల్లీ వంటి నగరాల్లో సినిమాను బట్టి టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఉందని గుర్తు చేశారు. సంవత్సరానికి వచ్చే ఐదారు భారీ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు అవసరమని, చిన్న సినిమాలకు రేట్లు పెంచాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. వారణాసి, పెద్ది, అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ, ఫౌజీ మరియు ఎన్టీఆర్ డ్రాగన్ వంటి భారీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు, ఆ మేరకు రిటర్న్స్ రావాలంటే టికెట్ రేట్లలో మార్పులు ఉండాలని కోరారు. త్వరలోనే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించనున్నట్లు నవీన్ తెలిపారు. టికెట్ ధరలపై ఒక శాశ్వత పరిష్కారం వస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వెసులుబాటు కల్పిస్తే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.  
- ఆ విష‌యంలో నాకు బాధ‌లేదు - నేను ప్రెస్టీజియ‌స్‌గా తీసుకున్న సినిమా ఇది - ఆ నిర్ణ‌యం రెండేళ్ల క్రిత‌మే తీసుకున్నాను టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న శ్రీలీల, తన కెరీర్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి మనసు విప్పి మాట్లాడింది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌తోనే ప్రయాణం చేస్తున్నాననీ, ఈ క్రమంలో కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం నేను రెండేళ్ల క్రితమే కమిట్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేసే క్రమంలో కొన్ని ఇతర అవకాశాలను వదులుకున్నాను. కానీ దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు" అని శ్రీలీల స్పష్టం చేసింది.  పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరైనా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారని, అలాగే తాను కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని ఆమె తెలిపింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కిందని ఆమె చెప్పింది. శ్రీలీల చేసిన ఈ వైరల్ అవుతున్న వ్యాఖ్యలు విన్న అభిమానులు, ఆమె డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.  ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి, కేవలం ఒకే ప్రాజెక్ట్ కోసం ఇతర ఆఫర్లను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై శ్రీలీల పెట్టుకున్న నమ్మకం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ఆమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). 'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉగాది కానుకగా రేపు(మార్చి 19) థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్(Harish Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  'ఉస్తాద్' లాంటి సినిమా వచ్చిన చాలా కాలమైంది అన్ని కమర్షియల్ హంగులతో నిండిన 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమా వచ్చి చాలా కాలమైందని హరీష్ శంకర్ అభిప్రాయపడ్డారు. చాలా కాలం తర్వాత ఒక బిగ్ స్టార్ నుంచి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ రాబోతోందని పేర్కొన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, సామాన్య ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పీక్ స్టేజ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. సినిమా నిడివి  ఎడిటింగ్ వర్క్ చాలా తక్కువగా ఉండేలా పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశామని హరీష్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ సుమారు 1 గంట 12 నిమిషాలు, అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే కాంపాక్ట్‌గా ఉంటుందని వివరించారు. సినిమా మొత్తం రెండున్నర గంటల లోపే ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించేలా స్క్రీన్ ప్లే సెట్ చేసినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్  పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ తో బిజీ ఉన్నప్పటికీ, ఆయన షూటింగ్‌కు అద్భుతమైన సహకారాన్ని అందించారని హరీష్ కొనియాడారు. సమయపాలన విషయంలో పవన్ చాలా కచ్చితంగా ఉండేవారని, దానివల్ల షూటింగ్ వేగంగా పూర్తయ్యిందని చెప్పారు. 7 గంటలకు షూటింగ్ అంటే అంతకంటే ముందే సిద్ధంగా ఉండేవారు. ఆయన ఇచ్చిన సహకారం వల్లే సినిమాను ఎక్కడా వేస్టేజ్ లేకుండా, చాలా ప్లాన్డ్ గా పూర్తి చేయగలిగామన్నారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం అదృష్టం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా, తాను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారని ప్రశంసించారు. మా నిర్మాతల మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇలాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి అన్నారు. బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2' తో పోటీ ఆదిత్య ధర్ చాలా సమర్థుడైన డైరెక్టర్ అని, అయితే వారి జోనర్ వేరు, మన జోనర్ వేరని అన్నారు. ఉగాది నుండి 'ఉస్తాద్' హవా మొదలవుతుందని, ఇది కేవలం సినిమా రిలీజ్ మాత్రమే కాదు, ఒక సెలబ్రేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. రికార్డులు, కలెక్షన్ల నంబర్ గేమ్ గురించి పక్కన పెడితే, థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు "చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చూశాం" అనే తృప్తితో బయటకు వస్తారని హరీష్ శంకర్ బల్లగుద్ది చెప్తున్నారు. మొత్తానికి హరీష్ శంకర్ మాటలు వింటుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' తో బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.   
  ఇటీవ‌లి కాలంలో సినిమాల‌కు సంబంధించి జ‌రిగే ఈవెంట్స్‌లో ర‌క‌ర‌కాల వివాదాలు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు సెల‌బ్రిటీల నుంచి వింటున్నాం. వారికి సంబంధించి ఏ చిన్న క్లిప్పింగ్ బ‌య‌టికి వ‌చ్చినా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఈవెంట్‌లో శ్రీ‌లీల‌, న‌టుడు మ‌హేష్‌కి సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి మీడియా నుంచి ఎదురైన ప్ర‌శ్న‌కు శ్రీ‌లీల వివ‌ర‌ణ ఇచ్చారు.  నేను ఈవెంట్‌లో ఉన్న‌ప్పుడు వెన‌క నుంచి ఏదో సౌండ్ వినిపించింది. అందుకే వెన‌క్కి తిరిగి చూశాను. నా ఫోన్ మ‌హేష్‌గారి ద‌గ్గ‌ర ఉంది. నేను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆయన నా ఫోన్ పట్టుకుని నాకు హెల్ప్ చేశారు. నేను కేవలం నా ఫోన్ కోసమే వెనక్కి తిరిగాను తప్ప, ఆయనను వేరే ఉద్దేశంతో చూడలేదు. సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న క్లిప్పింగ్స్‌ను చూసి ఎవరినీ తప్పుగా అంచనా వేయకండి. అక్కడ ఏదో సీరియస్ స్పీచ్ జరుగుతుండటంతో నేను కూడా చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉన్నాను. నా గురించి వచ్చే 'అహంకారం', 'మిస్ బిహేవియర్' అనే పెద్ద పెద్ద మాటలు విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా అందరి ముందు ధైర్యంగా చెప్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలు అప్పుడప్పుడు అపార్థాలకు దారితీస్తాయి. మేము స్వయంగా నోటితో చెప్పే వరకు దేన్నీ నమ్మకండి అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క్ల‌ప్పింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు శ్రీ‌లీల‌.
    -అభిమానులకి షాక్ ఇచ్చిన ధురంధర్ 2  -ఎందుకు ఇలా చేసారు -మరి ఎప్పుడు  ధురంధర్ 2(Dhurandhar 2)తెలుగు లాంగ్వేజ్ రిలీజ్  కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారంటే తెలుగులో తమ అభిమాన హీరో సినిమా కోసం అయితే ఎంతగా ఎదురుచూస్తారో అంతగా. పైగా రెగ్యులర్ సినీ ధరలకే మూడుగంటల నలభై తొమ్మిది నిమిషాల ఆరు సెకన్ల నిడివి కావడంతో ధురంధర్ 2 తో ఉగాది ముందే వచ్చిందనే ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే న్యూస్ వాళ్ళని పలకరించింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ధురంధర్ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ వాయిదా పడింది. సదరు వాయిదాకి టెక్నీకల్ ఇష్యు కారణమని టీం ప్రకటించింది. ఈ న్యూస్ ధురంధర్ 2 ని తెలుగులోనే చూడాలని కోరుకున్న వారికి షాక్ . టికెట్స్ బుక్ చేసిన వారికి అమౌంట్ రిఫండ్ చేశామని చెప్తున్నా  ఇంకా చాలా మందికి బుక్ మై షో యాప్ లాంటి వాటి నుంచి అమౌంట్ రావాల్సి ఉంది.  హిందీ లాంగ్వేజ్ లో మాత్రం యధావిధిగా షోస్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల  నుంచి పడనున్నాయి.     Also read: UStaad Bhagath singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ!. దేఖ్ లేంగే సాలా... చూసినాము చాలా ధురంధర్ తెలుగు అభిమానులు, మూవీ లవర్స్ అయితే టెక్నీకల్ ఇష్యుకి కారణమైన వాళ్ళని తిట్టుకుంటున్నారు. ఎవరి బాధ వాళ్ళది మరి   
    - పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్‌తో శ్రీలీల కొత్త స్టైల్ - ‘ఇచ్చిపడేసే గోత్రం..’ శ్రీలీల కోటుపై పవర్ స్టార్ క్రేజీ డైలాగ్! - ఉస్తాద్ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీమ్.. శ్రీలీల నయా లుక్ కేక! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమైంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం హీరోయిన్ శ్రీలీల ఎంచుకున్న సరికొత్త స్టైల్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో శ్రీలీల ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన ఒక ప్రత్యేకమైన బ్లాక్ కోటు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ కోటుపై ఈ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ముద్రించి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చెప్పిన "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఈ కోటు వెనుక భాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ మేనరిజం, ఆ డైలాగ్ డెలివరీకి ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అవ్వగా, ఇప్పుడు శ్రీలీల ఆ డైలాగ్‌ను తన దుస్తులపై ధరించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. తనదైన స్టైల్‌తో సినిమాను ప్రమోట్ చేస్తున్న శ్రీలీల ఐడియాకు నెటిజన్లు మార్కులు వేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, నటనతో ప్రేక్షకులను అలరించనుంది. ఈమెతో పాటు మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా కూడా నటిస్తోంది. అయితే రాశీ ఖన్నాకు, శ్రీలీలకు మధ్య ఈ సినిమాలో కాంబినేషన్ సీన్లు ఉండవని ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో వెల్లడైంది. అయినప్పటికీ వీరిద్దరూ తమ పాత్రలతో సినిమాకు గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ, ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఆమె మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీలీల లేటెస్ట్ ఫోటోలపై పవన్ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. "అచ్చం భగత్ సింగ్ స్టైల్‌లోనే ఉంది" అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఉగాది పండుగ ముందే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాతో అసలైన పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు
  -రేపు వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ ఆగమనం  -మరో హిట్ పవన్ ఖాతాలోకి వెళ్లిందా! -ఫస్ట్ రివ్యూ నిజమేనా! 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసనే' తన డైలాగ్ కి తగ్గట్టే పవన్(Pawan Kalyan)ఈ సారి 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)విషయంలో బెనిఫిట్ షోస్ తో పాటు టికెట్ రేట్స్ విషయంలో తగ్గాడు. రేపు ఉదయం మాములు రేట్స్ ,ఎర్లీ మార్నింగ్ షోస్ తో ఉస్తాద్ సందడి షురూ కానుంది. అదంతా అభిమానులు, ప్రేక్షకుల కోసమే. దీంతో వాళ్లంతా నయా జోష్ తో ఉన్నారు. పైగా కొత్త సంవత్సరం ఉగాది కూడా కావడంతో వాళ్ళ రాజయోగం, ఆదాయం ఉస్తాద్ తో పెరిగాయనే ఆనందం  వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఆ ఆనందం ఉస్తాద్ కి సంబంధించిన మరో న్యూస్ తో రెట్టింపయ్యింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఉస్తాద్ ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పవన్ ఎంట్రీ సూపర్. ఈ సందర్భంగా పవన్ నుంచి వచ్చిన డైలాగ్స్, శ్రీలీల, పవన్ మధ్య వచ్చిన సన్నివేశాలలో వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ వర్క్ అవుట్ అయ్యింది. నెగిటివ్ క్యారక్టర్ పార్తీబన్ తో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.    ఇంటర్వెల్ ట్విస్ట్  బాగా పేలింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కి తగ్గట్టే చాలా వేగంగా కదిలింది. కథ మెయిన్ పాయింట్ తెరపైకి రావడంతో పాటు సున్నితమైన ఆ పాయింట్ ని చెప్పిన విధంగా బాగుంది. విలన్స్ తో పవన్ చేసిన పోరాట దృశ్యాలు మెస్మరైజ్ చేసాయి. రాశి ఖన్నా క్యారక్టర్ డిజైన్ కూడా బాగుంది. దేవిశ్రీప్రసాద్(Devisriprasad)సాంగ్స్ తో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , పవన్ పెర్ఫార్మ్ ప్రధాన ప్లస్ గా నిలిచాయి. మైత్రి నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ, ఆర్ట్ డిపార్మెంట్ కథ యొక్క ఉద్దేశ్యాన్ని చెప్పడంలో భారీగా సక్సెస్ అయ్యాయి. హరీష్ శంకర్(Harish Shankar)టేకింగ్ కూడా ఎక్స్ లెంట్ గా ఉంది. నిర్మాత రవిశంకర్ చెప్పినట్టుగా ఖుషిలో పవన్ కనిపించాడని, మూవీ అయితే ఓవర్ ఆల్ గా మెప్పించే స్థాయిలోనే ఉందనే రివ్యూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Also read: UStaad Bhagath singh: వైరల్ గా నిలుస్తున్న ఉస్తాద్ కథ..ఇంతకీ ఆ సున్నితమైన పాయింట్ ఏంటి! మరి సదరు రివ్యూలో ఏ మాత్రం నిజముందో, రేపు ఉదయం ఆట తర్వాత కానీ  తెలియదు. ఫ్యాన్స్ అయితే తమ అభిమాన సంఘ సభ్యులకి సదరు రివ్యూని షేర్ చేస్తూ పదే పదే రివ్యూని చూసుకుంటూ మురిసిపోతున్నారు.   
- ఉగాది కానుకగా ఓటీటీలోకి 'సీతా పయనం' - యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె మూవీ ఓటీటీ అప్‌డేట్‌ - తండ్రి కోసం పెళ్లిని వద్దనుకున్న కూతురి కథ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'సీతా పయనం'. ఈ సినిమా ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. చాలా కాలంగా ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందుతోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (SunNxt)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. సీత (ఐశ్వర్య) అనే యువతి తన తండ్రి రాజేంద్రప్రసాద్ (సత్యరాజ్) మీద ఉన్న అమితమైన ప్రేమతో, తను లేకపోతే తండ్రి ఒంటరివాడైపోతాడని పెళ్లికి దూరంగా ఉంటుంది. ఒక ప్రయాణంలో ఆమెకు అభి (నిరంజన్) అనే యువకుడు పరిచయం అవుతాడు. వీరిద్దరి మధ్య సాగిన ఆ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చింది? అసలు అభి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ హీరోగా నటించారు. సీనియర్ నటుడు సత్యరాజ్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. అర్జున్ తన కూతురి లాంచ్ కోసం ఒక మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథను ఎంచుకోవడం విశేషం. ప్రయాణం నేపథ్యంలో సాగే సన్నివేశాలు, తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. గతంలో ఐశ్వర్య అర్జున్ ఇతర భాషల్లో సినిమాలు చేసినప్పటికీ, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నేటితరం అమ్మాయిలకు, తండ్రులకు మధ్య ఉండే అనుబంధాన్ని దర్శకుడు అర్జున్ చక్కగా ఆవిష్కరించారని ప్రశంసలు అందుతున్నాయి. మొత్తానికి పండుగ వేళ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమాల లిస్టులో 'సీతా పయనం' కూడా చేరిపోయింది. మార్చి 19న సన్ నెక్స్ట్ లో విడుదల కానున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. దీని తర్వాత ఐశ్వర్య అర్జున్ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీ కానున్నట్లు సమాచారం
గ్రాండ్‌గా విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్  ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్న లక్ష్మి తనయ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు మంచు వారింట సంబరాలు జరిగాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మి(Manchu Lakshmi) గారాల పట్టి విద్యా నిర్వాణ(Vidya Nirvana) ఓణీల వేడుక వైభవంగా జరిగింది. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్న విద్యా నిర్వాణ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో నిర్వహించిన ఈ వేడుకకు మంచు కుటుంబ సభ్యులతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా విద్యా నిర్వాణను ఓణీలో ముస్తాబు చేయగా, ఆ చిన్నారి ముఖంలో వెలిగిపోతున్న చిరునవ్వు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  ఈ అపురూప ఘట్టాన్ని చూసి మంచు లక్ష్మి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. "నా కూతురు ఆశీర్వాద వేడుక. ఈ వేడుకను ఇంత అద్భుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అంటూ మంచు లక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. https://www.instagram.com/p/DV_XlubiERm/ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగానే నెటిజన్లు, సినీ ప్రముఖులు విద్యా నిర్వాణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "మంచు వారి చిన్నారి అందంగా ఉంది" అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. "చాలా అందంగా ఉంది" అంటూ ఉపాసన కొణిదెల కామెంట్ పెట్టడం విశేషం. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మంచు లక్ష్మి.. తన కుమార్తె విద్యా నిర్వాణను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుమార్తెతో క్యూట్ మూమెంట్స్ ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు.  కాగా, విద్యా నిర్వాణ అతి చిన్న వయసులోనే చెస్ ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకుని రికార్డులు సృష్టించడం విశేషం. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, విద్యా నిర్వాణ ఇప్పటివరకు వెండితెరపై మెరవలేదు. భవిష్యత్తులో మంచు వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందేమో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...