ప్రేమ పేరుతో పెళ్లి.. తర్వాత వేధింపులు, దాడి!

Publish Date:May 23, 2026

Advertisement

మొదట ఫ్రెండ్ అన్నాడు.. తర్వాత ప్రేమిస్తున్నాన డు.. నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు నిన్ను చంపేస్తానంటూ దాడి చేస్తున్నాడు  అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి విడుదల చేసిన వీడియో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెడితే.. రాంపల్లికి చెందిన మనీషా అనే యువతి లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసింది. ఉప్పల్‌కు చెందిన సంతోష్ రెడ్డి ఆమెకు క్లాస్‌మేట్‌గా ఉండేవాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య  పరిచయం పెరగడంతో మొదట స్నేహితుడిగా దగ్గరయ్యాడని, అనంతరం ప్రేమ పేరుతో నమ్మించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భారీగా ఆస్తులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నానని చెప్పి తనను నమ్మించాడని తెలిపింది.  నువ్వు లేని జీవితం నాకు వద్దు  అంటూ ప్రేమ మాటలతో ఒప్పించి ఇండియాకు రప్పించి పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. ఇరు కుటుంబాల  సమక్షంలో 2014లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగినట్లు తెలిపింది.

వివాహ సమయంలో 40 తులాల బంగారం, ఒక ఫ్లాట్‌ను కట్నంగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు సంసారం సాఫీగా సాగినప్పటికీ, అనంతరం భర్త సంతోష్ రెడ్డి తనకు తెలియకుండా ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద సుమారు కోటి రూపాయల వరకు అప్పులు తీసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయం బయటపడటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని మనీషా తెలిపింది.  నిన్ను అమ్మి నా అప్పులు తీరుస్తాను అంటూ బెదిరించేవారని కూడా ఆరోపించింది.

తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని నిలదీయగా.. నా వెనుక అంబర్పేట్ శంకర్, అతని అనుచరులు ఉన్నారు  అంటూ తనను, తన తల్లిదండ్రులను బెదిరించేవాడని మనీషా ఆ వీడియోలో ఆరోపించింది. వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్‌కు రావాలని పోలీసులు సూచించినప్పటికీ, సంతోష్ రెడ్డి హాజరు కాలేదని తెలిపింది. ఇటీవల పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా తనపై, తన తల్లిదండ్రులపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారని మనీషా ఆరోపించింది. ఈ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, ప్రభుత్వం  తనకు న్యాయం చేయాలంటూ మనిషా విజ్ఞప్తి చేస్తూ విడియో విడుదల చేసింది. ఈ ఘటనపై మనీషా తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

By
en-us Political News

  
దేశంలో ఇప్పటికీ దాదాపు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనిపించకుండా పోయిన ప్రతి నిమిషం కీలకం. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టొచ్చు అని హెచ్చరించింది.
ఈ హత్య వెనుక భూ వివాదాల కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ భూముల వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మలక్‌పేట్ ప్రాంతంలోని భూ వివాదాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.వక్ఫ్ ఆస్తులు, భూములకు సంబంధించిన అంశాల్లో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో అడ్వకేట్ కాజా మొయినుద్దీన్‌కు గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తూ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌ను పరిచయం చేశాడు. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రంతోనే అబ్బుర పరుస్తున్నాడు.
నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. బాధితులు శిఖరం నుంచి కిందకు దిగుతుండగా తీవ్ర అలసటతో అస్వస్థతకు గురయ్యారు. వారిని రక్షించేందుకు గైడ్స్‌ తీవ్రంగా ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. మృతులను భారత్‌కు చెందిన అరుణ్‌ కుమార్‌ తివారీ, సందీప్‌ ఆరేగా గుర్తించారు.
పరస్పర అంగీకారంతో ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు.. తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకంగా రోమియో జూలియట్ క్లాజ్ తీసుకు రావాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
కొన్ని రోజులుగా ఆమెపై ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్ మీడియా వేదికల్లో కొందరు వ్యక్తులు అసభ్యకర పోస్టులు, అవమానకర కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. గౌరవాన్ని కించప రిచేలా పోస్టులు వైరల్ చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.