మార్కులు కాదు.. తెలివి ముఖ్యం!
Publish Date:Jun 18, 2022
Advertisement
పుట్టుకతో వచ్చే మేధాశక్తి, తెలివితేటల అభివృద్ధే విద్య లక్ష్యమని మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ అన్నారు. వందకి వంద మార్కులు వస్తేనే గొప్ప తెలివిగలవాడు అనుకోరాదు. క్లాసులో నేర్చుకుంటున్న విద్యకు సమయస్పూర్తి జోడించి సమాజంలో వ్యవహరించేవారు విజేతలు అవుతారని అంటూంటారు. చదువునేర్వడం అంటే కేవలం పీజీలు, డాక్టరేట్లు సంపాదించడం కాదని వారి వాదన. స్కూల్లో చదువుకునే రోజుల్లో అంత బాగా చదవులో రాణించకున్నా, ఆ తర్వాత చదువు పట్ల ఆసక్తి పెరిగి విద్యలో రాణించి జీవితంలో గొప్ప స్థాయిలో నిలవడం హర్షణీయమే. అయితే విద్యార్ధి దశలో అద్భుతంగా రాణించలేకపోయినా ఉన్నత వుద్యోగాలు చేసినవారు, చేస్తున్నవారూ వున్నారు. అదుగో అలాంటి వారు గుజరాత్ ఐఏఎస్ అధికారి. ఆయన టెన్త్ మార్కుల లిస్ట్ చూస్తే ఈ మహానుభావుడు ఐ ఎ ఎస్ అధికారి ఎలా అయ్యాడా అని అనుమానించకపోరు. అసలు 90 శాతం తక్కువ మార్కులు వస్తేనే ఆ విద్యార్ధి ఎందుకు పనికి రాడన్న నిర్ణయానికి రావడం, అదే ప్రచారం చేయడం కంటే దారుణం మరోటి వుండదు. తుషార్ భవిష్యత్తులో ఏ వుద్యోగానికీ, పనికీ పనికి రాడని అతని గ్రామస్తులే కాదు స్వయంగా స్కూలు వాళ్లే చెప్పడం విడ్డూరం. చిత్రంగా అతను ఐఎఎస్ చదివి పెద్ద అధికారిగా వారికి దర్శనమిచ్చాడు! అన్నట్టు ఈ ట్విటర్ పోస్టును 17 వేలమంది చూసి ఆశ్చర్యపోయారట. తుషార్ ఆ విధంగా జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడం చాలామంది గుజరాతీ విద్యార్ధులకు గొప్ప స్పూర్తిగా నిలిచింది. మరం చేత, గణితంలోనో, సైన్స్‌లోనో పోనీ ఇంగ్లీషులోనో అనుకున్నదాని కంటే బాగా తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన పిల్లలు చదువులో బాగా వెనకబడిపోయారన్న అభిప్రాయానికి తల్లిదండ్రులు రాకూడదు.
ఇక్కడే కింగ్ జూనియర్ మాట గురించి ఆలోచించాలి. పాఠశాల చదువులో వెనకబడ్డ మాత్రాన తెలివి తక్కువ వాడు, ఎందుకు పనికిరానివాడు అవుతాడనుకోవడం పెద్ద పొరపాటు. కానీ చదువుకునే వయసు లో తల్లిదండ్రులు, టీచర్లు మార్కుల కోసమే బడి, ట్యూషన్లకు కట్టిపడేయడం పరిపాటిగా మారింది. మరీ ఈ రోజుల్లో అసలు పిల్లలకు చదువుకోవడం తప్ప వేరే వ్యాపకం లేకుండా పోయింది. ఇది ఎంతవరకూ ఆరోగ్యకరం అనేది వేరే విషయం. కానీ వందకి వందా వచ్చి తీరాల్సిందే అని నిబంధనతో బలవంతపు చదువులు చదివించడంలోనే పెద్దలంతా పిల్లల మీద మానసిక వొత్తిడి తెస్తున్నారు. అసలు అంతగా పెద్దలు ఓవరాక్షన్ చేయనవసరం లేదని, సహజతెలివి వుంటే చాలని అవినీష్ శరణ్ రుజువు చేసారు.
ఈ గుజరాత్ ఐఎఎస్ అధికారి గుజరాత్ బారూచి కి చెందిన మరో ఐఎఎఎస్ అధికారి తెషార్ సుమేరా మార్కుల లిస్ట్ ట్విటర్‌లో షేర్ చేసేడు. దాన్ని చూస్తే ఖంగారు పడతారు. ఇంగ్లీషులో వందకి 35, గణితం 36, సైన్స్‌లో 38 వచ్చా యి!
http://www.teluguone.com/news/content/marks-are-just-numbers-wisdom-and-determination-important-important-25-137937.html





