యుద్ధం అసాధ్యం.. అందుకే లొంగుబాటు!

Publish Date:Jan 5, 2026

Advertisement

సాయుధ పోరాటం అసాధ్యమని మావోయిస్టు అగ్రనేత బట్సే దేవా అలియాస్ సుక్కు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల లొంగిపోయన సుక్క.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమైన తరువాత ఆయన స్కథానంలో మావోయిస్టు పార్టీ ఆయుధ దళాధిపతిగా నియమితుడయ్యాడు. బట్సే దేవా అలియాస్ సుక్క తనతో పాటు 19 మంది మావోయిస్టు కేడర్లతో కలిసి 40 అధునాతన ఆయుధాలతో  ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే.  

మావోయిస్టు కేంద్ర కమిటీలో అంతర్గతంగా ఏం జరిగిందన్నది తనకు అంత స్పష్టంగా తెలియదన్న సుక్మ,  మల్లోజుల లొంగుబాటు తరువాత పార్టీ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిందని చెప్పారు.  సాయుధ పోరాటం వీడాలన్న చర్చ పార్టీలో జరిగిందా అన్న సందేహాలు కూడా తలెత్తాయనీ,  అయితే కొన్ని రోజుల తర్వాత పరిస్థితిపై స్పష్టత వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని  బట్సె దేవా అలియాస్ సుక్క వెల్లడించారు. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాతనే తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో లొంగిపోయినట్లు వివరించారు.   తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ దాడుల సమయంలోనే దొరికినవేనని, ఆయుధాల తయారీకి ప్రత్యేక ఫ్యాక్టరీ కూడా తమకు ఉందని పేర్కొన్నారు. కొన్ని ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునేవారమని చెప్పిన సుక్మ..  హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధాలను కూడా తయారు చేశామన్నారు.  మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ  కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు.

హెడ్మా మరణం తర్వాత పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిందనీ, హెడ్మా ఎన్ కౌంటర్ కు ముందే పార్టీ తనను  పీఎల్‌జీఏ కమాండర్‌గా నియమించిందనీ, హెడ్మా ఉన్న సమయంలోనే తానా బాధ్యతలు నిర్వహించానని దేవా వెల్లడించారు. ఒకప్పుడు 400 మంది వరకు ఉన్న పీఎల్‌జీఏ కమాండర్లు ఇప్పుడు  60 మందికే పరిమితమయ్యారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లొంగిపోయిన తరువాత  పునరావాసం కల్పించారని, భవిష్యత్ లో ఎటు వెళ్లాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దేవా చెప్పారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో ఎవరు పనిచేస్తున్నారన్న విషయమూ తనకు తెలియదని దేవా చెప్పారు.  

బసవరాజు స్థానంలో దేవిజీ నియమితుడయ్యారన్న సమాచారమూ తనకు అందలేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు వెల్లడించలేనన్న సుక్మా మాట లతో మావోయిస్టు ఉద్యమం ప్రస్తుత స్థితిని, అంతర్గత బలహీనతలు స్పష్టంగా వెల్లడయ్యాయని రాజ కీయ, భద్రతాదళాలు భావి స్తున్నాయి. 

By
en-us Political News

  
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.
ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు.
పర్యాటక రంగాన్ని ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ, పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు.
కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.
కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
యంగ్ ఇండియా స్కూల్ లో బ్రేక్‌ఫాస్ట్‌ అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు.
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు
బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌-11 పరిధి ఉదయ్‌నగర్ బస్తీలో ఇసుక టిప్పర్ నాళాలో బోల్తా పడింది.
మాజీ సీఎం కేసీఆర్‌ను మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.