టూరిజం డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు
Publish Date:Jan 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని క్రియోటివ్ అకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. విజయవాడ పున్నమీ ఘాట్ లో అవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన యూరోపియన్ యూనియన్ రాయబారి (ఈయూ) రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు. తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ ప్రతిరూపమన్న చంద్రబాబు ఆవకాయ్ అనగానే ప్రపంచంలో ఎవరికైనా సరే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు. ఇక ఈ ఆవకాయ ఫెస్టివల్ ను తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా నిర్వహించుకుంటున్నామన్న చంద్రబాబు తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు. కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి. మైసూర్, కలకత్తాలకు దీటుగా విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా ఆ ఉత్సవాలను జరుపుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.
http://www.teluguone.com/news/content/andhrapradesh-as-tourism-destination-36-212264.html





