ఖ‌మ్మం బ‌రిలో మండ‌వ.. నామాకు ఇబ్బందులు దండిగా?

Publish Date:Apr 12, 2024

Advertisement

తెలంగాణలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ప్ర‌క‌టన‌ను పూర్తిచేసి ప్ర‌చార‌ప‌ర్వంలోకి దిగేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  తెలంగాణలో స‌త్తా చాటాలన్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలో అత్య‌ధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండాను ఎగుర‌వేయ‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు గాలివాటం కాద‌ని..  ప్ర‌జాబ‌లంతో అధికారంలోకి వ‌చ్చామ‌ని నిరూపించుకునేందుకు ఆ పార్టీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.  మ‌రోవైపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు అవుతున్నది. ఈ నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్లో అధిక‌ శాతం పూర్తిచేశామ‌ని, ఎన్నిక‌ల కోడ్ పూర్త‌వ్వ‌గానే మిగిలిన హామీల‌ను పూర్తి చేస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు మాత్రం.. హామీల అమ‌ల్లో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. విద్యుత్ కోత‌ల‌తో పాటు, తాగు, సాగు నీటి కొర‌త‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు గుణ‌పాఠం చెబితేనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అవుతాయ‌ని బీజేపీ, బీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. మొత్తానికి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన ప‌రిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్ప‌డింది. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక‌పై పార్టీ కేంద్ర‌, రాష్ట్ర పెద్ద‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్  నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 13 నుంచి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఆ పార్టీ పెద్ద‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇంకా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అధిష్టానం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా చెప్పుకొనే ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. ఖ‌మ్మం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్యా ఎక్కువ‌గానే ఉంది. ముఖ్యంగా త‌మ కుటుంబ స‌భ్యుల‌కు టికెట్ ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందిని, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ్ముడు పొంగులేటి ప్ర‌సాద్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు యుగంధ‌ర్ లు ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు త‌మ ప్ర‌య‌త్నాలను కొన‌సాగిస్తున్నారు. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంతరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జ‌ట్టి కుసుమ కుమార్‌, వ్యాపార‌వేత్త వంకాయ‌ల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌లు ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అధిష్టానం  వీరిలో ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విష‌యంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్  అధిష్టానం ప‌లుసార్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు పేర్ల‌తో స‌ర్వేలు కూడా  నిర్వ‌హించింది. స‌ర్వేకు సంబంధించిన ఫ‌లితాలు కేంద్ర పార్టీ పెద్ద‌ల చేతికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి  ఢిల్లీకి వెళ్ల‌డంతో నేడో రేపో ఖ‌మ్మం పార్ల‌మెంట్ అభ్య‌ర్థి  ఎవ‌ర‌నే విష‌యంపై క్లారిటీ వ‌స్తుంద‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రూ ఊహించ‌ని పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన సీనియ‌ర్ నేత మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం హ‌యాంలో మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు మంత్రిగా ప‌నిచేశారు. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు హ‌యాంలోనూ తెలుగుదేశంలో కీల‌క భూమిక పోషించారు. కేసీఆర్‌ స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో   2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.  కాగా.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో  మండవ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, రేవంత్ రెడ్డికి మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు అత్యంత స‌న్నిహితులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండ‌వ.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. దీంతో  ఆయనను ఖ‌మ్మం పార్ల‌మెంట్ నుంచి బ‌రిలోకి దింపాల‌ని తుమ్మ‌ల సూచించ‌గా.. సీఎం రేవంత్ రెడ్డిసైతం ఆమోదం తెలిపార‌ని, దీంతో మండ‌వ పేరు కాంగ్రెస్ హైకమాండ్  ప‌రిశీల‌న‌లో ఉంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా అవ‌కాశం క‌ల్పించ‌లేదు. ఖ‌మ్మంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌కు టికెట్ ఇస్తే ఆ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.  ఈక్ర‌మంలో మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు ప‌లువురు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల పేర్ల‌ు అధిష్టానం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే.. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ఉమ్మ‌డి  ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీతోపాటు, టీడీపీకి గ‌ట్టి బ‌లం ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం క్యాడ‌ర్‌ మద్దతు ఇవ్వడంతో   ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ముఖ్యంగా ఆంధ్రాకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఖ‌మ్మం పార్ల‌మెంట్  నియోజకవర్గ ప‌రిధిలో  తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం ఓటుబ్యాంకు ఎరికి  వైపు మ‌ళ్లితే వారిదే విజ‌య‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో తెలుగుదేశం లేదు.  ఈ ప‌రిస్థితుల్లో నామా నాగేశ్వ‌ర‌రావుకూడా గ‌తంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన వ్య‌క్తి కావ‌డంతో గ‌తంలోలా తెలుగుదేశం ఓటు బ్యాంకు నామాకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. అసలు ఆ ఉద్దేశంతోనే  బీఆర్ ఎస్   నామాకు  టికెట్ ఇచ్చిందన్న అభిప్రాయం కూడా పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో గతంలో చురుకుగా పని చేసిన మండవను బరిలోకి   దింపితే నామాను సునాయాసంగా ఓడించవచ్చన్నది  కాంగ్రెస్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానం నిర్వ‌హించిన‌ స‌ర్వేల్లోనూ ఇదే  విష‌యం స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది.  తెలంగాణ వ్యాప్తంగా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును తెలుగుదేశం సానుభూతిప‌రులు అభిమానిస్తారు.  ముఖ్యంగా ఖ‌మ్మం జిల్లాలో మండ‌వకు మంచి ఆద‌ర‌ణ ఉంది. నిజాయతీపరుడిగా మండవకు గుర్తింపు ఉంది. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించే మండవ.. తెలుగుదేశం పార్టీని వీడినా ఇప్పటి వరకూ పార్టీపై కానీ, పార్టీ అధినేతపై కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు.  అటువంటి మండవను   ఖ‌మ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి  బ‌రిలోకి దింపితే.. తెలుగుదేశం  ఓటు బ్యాంకు పూర్తిగా మండ‌వ వైపు వ‌స్తుంద‌ని, దీంతో గెలుపు సునాయాసం అవుతుంద‌ని రేవంత్ రెడ్డి భావి స్తున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా  మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే నామా నాగేశ్వ‌ర‌రావుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.