Publish Date:Apr 12, 2024
మరో సారి ప్రాంతీయ మంటలను రేపి ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారా? వివాదాస్పద అంశాలను రాజకీయం చేసి తమిళనాట ఎన్నికలలో ప్రయోజనం చేకూర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు.
కచ్చాతీవు ద్వీపాన్ని 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంక దేశానికి అప్పగించిందని, ఆ ద్వీపాన్ని తిరిగి భారత్ లో కలిపేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. గత పదేళ్లుగా అధికారంలోనే ఉన్న ప్రధాని మోడీ ఎప్పుడూ కచ్చతీవు అంశంపై నోరెత్తింది లేదు. సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట, అది తమిళనాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ఈ ప్రకటన చేయడం వెనుక ఉన్న ఎత్తుగడ ఎన్నికల లబ్ధి పొందేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని ఆయన ప్రకటించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ బంగ్లాదేశ్ కు 10వేల ఎకరాలు ధారాదత్తం చేసారని ప్రతి విమర్శ చేసారు.
దేశ ప్రయోజనాల నిమిత్తం పొరుగు దేశాల తో జరిగిన ఒప్పందాలను బీజేపీ వివాదం చేస్తున్నదని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. 1921 నుంచి కచ్చతీవు ద్వీపం శ్రీలంక (బ్రిటిష్ సిలోన్) ఆధీనంలో ఉంది. 1974వరకు భారత్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని గుర్తించే వరకు ఇరుదేశాల మధ్యా ఇది వివాదంగానే ఉంది. ఈ ద్వీపం వైశాల్యం 285ఎకరాలు. జాఫ్నా ద్వీపకల్పంలో నెడుంతీవు, రామేశ్వరం మధ్య కచ్చాతీవు ఉంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఇండో శ్రీలంక సముద్ర ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు చెందినదిగా అంగీకరించారు. చరిత్ర తిరగేస్తే 1187-96మధ్య పాలించిన శ్రీలంక రాజు నిస్సంక మల్లా రామేశ్వరం శాసనంలో ఈ కచ్చి దీవు ప్రస్తావన ఉంది. ఈ ద్వీపం పోర్చుగీసు,డచ్, బ్రిటీష్ వారి హయాంలో శ్రీలంక పరిధిలోనే ఉంది.
మధ్యయుగంలో జాఫ్నా రాజ్యంలో ఉంది. 17వ శతాబ్దం నుంచి రామ నాడ్ రాజ్యం లో (మధురై జిల్లా) ఉండేది. ఆ తర్వాత భారత ఉపఖండం తోపాటు బ్రిటీష్ వారి అధీనంలోకి వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీ లో భాగమైంది. ఈ ద్వీపంలో కాథలిక్ మందిరం ఉంది. ఇరు దేశాల భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. ఈ ద్వీపంపై భారత ప్రభుత్వం శ్రీలంక సార్వభౌమత్వం అంగీకారంపై తమిళనాడు మత్స్యకారుల లో ఉన్న అసంతృప్తి ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల అస్త్రంగా కచ్చాదీవు వ్యవహారాన్ని కెలికి వివాదం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇరు దేశాలు మళ్లీ చర్చలు పునఃప్రారంభించాలన్న భారత్ డిమాండ్ ను శ్రీలంక తోసిపుచ్చింది. ఇది ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం కనుక దీనిపై చర్చలు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా చేసుకున్న ఒప్పందాలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించకపోవడం సముచితం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/katchateevu-as-bjp-election-weapon-25-173638.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.