13 ఏళ్ళ మైనర్ బాలిక పై.. పెద్దనాన్న..
Publish Date:May 31, 2021
Advertisement
ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్అ. తని పేరు రాములు. అతని వయసు 50 సంవత్సరాలు. అతను ఒక కసాయి వాడు. మానవ మృగం. మానవత్వం మరిచిన మూర్ఖుడు, రక్త సంబంధం విస్మరించిన విషనాగు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాందుడు. ఓ మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నగరంలో నివాసం ఉండే ఓ మహిళ పొట్ట కూటి కోసం ఇండ్లలో పనిచేస్తోంది. ఆమె భర్త లేబర్‌గా వర్క్ చేస్తున్నాడు. వారి 13 ఏళ్ల అందమైన కూతురు ఉంది. ఆ అమ్మాయి ఆరో తరగతి చదువుతోంది. వాళ్ళ ఇంట్లో టీవీ లేదని బాలిక టీవీ చూసేందుకు అప్పుడప్పుడు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రాములు అనే నీచుడు, మృగం ల ప్రవర్తించాడు. కూతురు వరస అయితది అని కూడా ఆలోచించకుండా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్దుడు. అంతటితో ఆగక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. బాధను కనిపించకుండా దాచగలం.. మాట వదిలేయగలం.. దెబ్బను మాన్పగలం.. కానీ గర్భం కదా.. ఆ బాలిక దాచలేక పోయింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం తల్లిదండ్రులు గమనించారు. ఏంటని అడిగారు అయినా ఆ బాలిక జరిగింది చెప్పలేదు. మరోవైపు ఈ నెల 24న బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు పరీక్షలు చేసిన తర్వాత ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చాక.. తల్లిదండ్రులు ఆ బాలికను గట్టిగా నిలదీశారు. ఆ బాలిక అమ్మను పట్టుకుని బోరున ఏడుస్తూ... బాలిక భయపడుతూ అసలు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. పెద్దనాన్న రాములు తనపై అత్యాచారం చేసినట్టు పేర్కొంది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో ఎస్ఐ సెటిల్ మెంట్‌కు ప్రయత్నించడం వల్లే ఘటన ఆలస్యంగా బయటకు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/man-rapes-impregnates-13-year-old-girl-25-116638.html





