మనిషికి మానసిక ధైర్యం అవసరమెంత?

Publish Date:Aug 29, 2022

Advertisement

అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. మనం విజయాలు సాధిస్తున్నప్పుడు జీవితం ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. కొందరుంటారు ఎదుటివారు విజయం సాధించగానే, ఉన్నత స్థాయిలోకి వెళ్లారని తెలియగానే అదేదో ఒక్కసారిగా ఆ స్థానానికి వెళ్లిపోయినట్టు ఎంతో ఈసీ అన్నట్టు చెప్పేస్తారు. కానీ ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాల కష్టమే వారి ప్రస్తుత విజయానికి కారణం అనే విషయాన్ని తెలుసుకోరు. అంతేనా గెలిచిన వారి వెంట ఎంతోమంది వెళతారు అదే పరాజయాల బాటలో నడుస్తున్నప్పుడు వెనక వచ్చేవారు ఎవరూ ఎక్కువగా ఉండరు. అలాంటప్పుడు మనుషులు నిరాశకు లోనవుతారు. అలాంటప్పుడు జీవితం విషాదమయంగా బాధల సుడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మనం చేసే పని అద్భుతంగా చేసి తీరాలి. 

మనం కష్టాలలో ఉన్నాం కదా అని చేసే పనిలో నిర్లక్ష్యం చూపకూడదు. దీనికి మానసిక ధైర్యం కావాలి. ప్రపంచంలో మనం ఏం కోల్పోయినా ఫర్వాలేదు. కానీ మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మానసిక ధైర్యమే మనకు దీర్ఘకాలిక విజయాలను చేకూర్చి పెడుతుంది. మానసిక ధైర్యం అంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎంతో తెలివిగా అర్థం చేసుకోవడం,సమస్య ఏమిటో గుర్తించడం, సమస్య అర్థమయ్యాక దానికి పరిష్కారాన్ని వెతకడం, ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు, ఎన్నో నొచ్చుకునే విషయాలు భరించాల్సి రావచ్చు. కానీ వాటన్నిటినీ భరించాలి. అలా బాధలను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి.  చేసే పనులలో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఉన్నప్పుడే అప్పుడే మానసిక ధైర్యం అవసరం అవుతుంది. అలాంటప్పుడు మానసిక ధైర్యం ఎంత గొప్పదో, అది మనిషిని ఎలా నిలబెడుతుందో, మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో అర్థమవుతుంది.

 బాధల్ని, కష్టాల్ని, ఆర్థిక సమస్యలనూ అధిగమించడానికి మనం చేయాలనుకునే పనులను ఉన్నతంగా చేయడానికే ప్రయత్నించాలి. వీటి ఫలితం నూటికి నూరు శాతం వ్యతిరేకంగా వచ్చినా ధైర్యాన్ని సడలిపోనివ్వకూడదు. లక్ష్యం వైపుగానే అడుగులు వేయాలి తప్ప బేరువుగా పారిపోకూడదు. కంఫర్ట్ బుల్ జోన్ నుంచి బయటికి వచ్చినా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. కంఫర్ట్ జోన్ అంటే ఎప్పుడూ సమస్యలు రాకుండా సుఖంగా గడిచిపోవడం. అలాంటి సుఖం మనిషికి మంచిది కాదు. భవిష్యత్తులో ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుంది, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వలేదు. 

ప్రేక్షకుడి స్థాయి నుంచి ఫెర్ ఫార్మెన్స్ స్థాయికి ఎదగాలి. చప్పట్లు కొట్టే దశ నుంచి చప్పట్లు కొట్టించుకునే దశకి ఎదగాలి. అది మనిషిలో రావలసిన మార్పు. మనిషి ఒకే సర్కిల్ లో ఉండిపోతే అలా ఎదగడం ఎప్పటికీ సాధ్యం కాదు. మన మానసిక ధైర్యమే మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగిస్తుంది. మనం ఓటమిలో ఉన్నప్పుడు మన శత్రువుల మాటలకు, విమర్శలకు మౌనంగానే సమాధానం చెప్పాలి. ఇతరులు మన శక్తి సామర్ధ్యాలను శంకిస్తున్నప్పుడు, అనుమానిస్తున్నప్పుడు నిశ్శబ్ధంగానే రెట్టింపు పనిచేసి మనల్ని మనం ఋజువు చేసుకోవాలి. 

పరాజయాలలో ఉన్నప్పుడు మన పరాజయాలకు కారణాలుగా ఇతరులను నిందించవద్దు. సహనంతో వేచి ఉండాలి. మన చేతకానితనానికి ఇతరులను నిందించకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం, ఈ భూమి మనదే. ఇక్కడ దొరికే ప్రతి అవకాశం మనదే. మనం ఉపయోగించుకోవాలి. మనమే భూమి పుత్రులం. అవకాశాలకు జాతి, మత, కుల, ప్రాంతాలు లేవు. భయం మన గుండెల్లో గూడు కట్టుకుంటే ఏ పనీ సక్రమంగా చేయలేము. భయం మనల్ని తన గుప్పిట్లోకి తీసుకోకుండా జాగ్రత్తపడాలి. భయాన్ని అధిగమించాలి. భయాన్ని అధిగమించడానికి భౌతికంగా శారీరకంగా మానసికంగా రెండు విధాలుగా సంసిద్ధులు కావాలి. అప్పుడే మానసిక ధైర్యం మనల్ని విడిచిపోదు, అది మనతో ఉంటే మనం ఏదైనా సాధించగలం. 

                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.