మంచి వ్యక్తిత్వం ఇలా సాధ్యం!

Publish Date:Aug 30, 2022

Advertisement

మనిషిలో మంచితనం అనేది ఒక గొప్ప గుణం. ఈ గుణం ద్వారా మనిషికి సమాజంలో ఒక మంచి స్థానమంటూ ఏర్పడుతుంది. మంచితనాన్ని నింపుకున్న వ్యక్తిని మంచితనానికి నిదర్శనంగా అతనొక మంచి వ్యక్తిత్వం కలిగినవాడు, ఆమె మంచి వ్యక్తిత్వం కలది అని గుర్తుచేసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది వ్యక్తిత్వం విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. తమదగ్గర డబ్బు ఉందనో, గొప్ప ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఉందనో, ఇతరుల అవసరం తమకు రాదు అలాంటప్పుడు మంచిగా ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోనో మొత్తానికి వ్యక్తిత్వాన్ని మంచిగా ఉంచుకోరు. కానీ ఈ సమాజంలో విలువ అనేది డబ్బును, స్థాయిని వచ్చినా చివరికి వ్యక్తిత్వం దగ్గరే నిజమైన గౌరవం అనేది ఆగుతుంది.

మనం సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. మంచి వ్యక్తిత్వం సంపాదించుకోవడం అనేది మనమీదే ఆధారపడి వుంటుంది. మనిషి అనుకుంటే దేనినైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు అంటారు కదా. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించాలంటే మొదటిగా మనం అన్ని విషయాలలోనూ చాలా ధైర్యంగా, నిజాయితీగా వుండాలి. ఏ విషయం లోనైనా సరే ఆడంబరంగా వుండకూడదు. అట్లాగే మనం ఎప్పుడూ కూడా స్థిర మనోనిశ్చయం కలిగివుండాలి. మనం ఏవైనా చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు విజయాలు సాదించినప్పుడు మనం సాధించిన దానిపట్ల గర్వంగా వుండడంలో తప్పులేదు. ఎందుకంటే అది కష్టం వల్ల దక్కిన ప్రతిఫలం కాబట్టి. కానీ  అహంకారం మాత్రం వుండకూడదు. అహంకారం అనేది మనల్ని అణచివేస్తుంది.

మనం ఎప్పుడూ కూడా ప్రక్కవారితో అంటే ఎవరితో ల్నైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. అంతేకాని దురుసుగానో లేక అసలు మాట్లాడటం ఇష్టం లేనట్టు బలహీనంగా మాట్లాడకూడదు. బలహీనం అనేది మనలో ఉన్న నిరాశను నిరాసక్తిని తెలియజేస్తుంది. ఎందుకంటే నోటి వాక్కు చాలా బలమైనది. నోటి వాక్కును ఆయుధంగా వర్ణిస్తారు పెద్దలు.

అందుకే ఈ సమాజంలో ప్రతీది కూడా నోటివాక్కుతో ముడిపడి వుంటుంది. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం సాధించిన వాటి పట్ల సంతృప్తిపడాలి. అంతేగాని అలక్ష్యంగా వుండకూడదు. మనలక్ష్యం పట్ల మనకు డిటాచ్మెంట్ తో కూడిన ఎటాచ్మెంట్ వుండాలి. అంటే ఆ విజయం మనదే కావచ్చు కానీ విజయం సాధించిన తరువాత ఎప్పుడూ దాన్నే గుర్తుచేసుకుని తరువాత జరగవలసిన పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మంచి పేరును పొందగలము. 

కొందరు సమయం సందర్భం లేకుండా అర్ధం పర్ధం లేకుండా, మనసులో ఉన్న విషయం ఏదైనా సరే దాన్ని వెళ్లగక్కేస్తుంటారు.  పర్యవసానాలు ఏమిటో గ్రహించకుండా అనవసరంగా ఏదేదో మాట్లాడటం మానాలి. అలా మాట్లాడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, వాటి నుండి బోలెడు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఏ వ్యవహారంలోనైనా, తగాదాల్లోనైనా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించాలి. తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి.  మన చెవినపడ్డ ప్రతీ విషయాన్ని నిజమని నమ్మడం మానుకోవాలి. ఇతరుల మాటలను, చేతలను, జరుగుతున్న విషయాలను తప్పుగా అర్ధం చేసుకోకూడదు. అత్యుత్సాహంతో చేసేపనులు చివరకు సమస్యలే తెచ్చిపెడతాయి.

ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించాలి. ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా తీరికలేనట్లు ప్రవర్తించకూడదు. ప్రస్తుత కాలంలో చాలామంది చేసేతప్పు అదే. తీరికలేదు అన్నట్టు తప్పించుకు తిరుగుతారు. మంచి వ్యక్తిత్వం కావాలన్నా, నలుగురితో సత్సంబంధాలు ఉండాలన్నా ఎదుటివారికి కూడా వీలైన వరకు సమయాన్ని కేటాయించాలి. అలాగని పూర్తిగా వ్యక్తిగత పనులు వదిలేసుకొని మరీ అందరితో ఉండమని ఎవరూ చెప్పారు. అట్లాగే ఏదైనా తగాదా వచ్చినప్పుడు అవతలి వాళ్ళే ముందుగా దిగి రావాలని ఎదురు చూడకూడదు. మనమే మాట్లాడానికి ముందుకు రావాలి. మనం ఈ లక్షణాలు అన్నింటిని కలిగివుంటే ఈ సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు. మనం ఈ లక్షణాలన్నింటిని కలిగి వుండడానికి ప్రయత్నించాలి. నిజం చెప్పాలంటే ధైర్యం కలిగినవాళ్లే అన్నిటికి సిద్ధంగా ఉండగలరు. ధైర్యవంతుడిదే ఈ భూమి అన్నారు వివేకానందుడు ఆ విషయం మరిచిపోకండి.

                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.