పీఎం రేసులో దీదీ? ‘ఇండియా వాంట్స్ మమత’ ... పేరిట ప్రచారం ప్రారంభం

Publish Date:May 25, 2022

Advertisement

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటుకు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్,ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రివాల్ వరకు ఎవరి ప్రయత్నాలు వారి చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రయత్నాలు ఏవీ ఒక కొలిక్కి రాలేదు. మరోవంక ఈ అందరిని ఇంకొందరినీ ఒకే తాటి మీదకు తీసుకువచ్చి, చక్రం తిప్పేందుకు ఎన్నికల వ్యూహకర్త. ప్రశాంత్ కిశోర్, పట్టువదలని విక్రమార్కునిలా వరసగా, విఫల వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. 

అయితే బీజేపీకి ప్రత్యాన్మాయం సంగతి ఎలా ఉన్నా ఇంతవరకు ప్రధాని మోడీకి ప్రత్యాన్మాయం ఎవరు?2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రత్యర్ధి ఎవరు?  విపక్ష్లాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధి ఎవరు? అంటే క్వశ్చన్ మార్కే సమాధానం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరు ప్రచారంలో ఉన్నా, పార్టీ అధ్యక్ష పదవి తీసుకునేందుకే మూడేళ్ళుగా వెనక ముందూ అవుతున్న ఆయన ప్రధాని అభ్యర్ధిగా బరిలో దిగేందుకు అంగీకరిస్తారా? ఆయన అంగీకరించినా, ఆదరికీ ఆమోద యోగ్యం అవుతారా? అంటే అలాంటి అవకాశం అయితే లేదనే చెప్ప వచ్చని అంటున్నారు.

అయితే, పశ్చిమా బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మంట బెనర్జీ మాత్రం, నేనున్నాను అంటూ, బరిలో నిలిచేందుకు సిద్దం అవుతున్నారు. నిజానికి మమత బెనర్జీ అయినా మరొకరు అయినా ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ, ఆమోదయోగ్యం అవుతారా అంటే, అది కూడా అయ్యే పని కాదు. కానీ, పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే ప్రయత్నాలు ప్రారంబించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీని తమ పార్టీ ఎదుర్కుంటుందని, మమత ప్రకటించారు.

అంతే కాదు,2024 ఎన్నికల్లో మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్ధిగా ఇప్పటినుంచే ప్రధాని అభ్యర్ధిగా జనంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రచార కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ‘ఇండియా వాంట్స్ మమతా’ పేరిట వెబ్సైట్’ ను ప్రారంభించారు. అల్టిమేట్’ గ చివరకు ఏమవుతుంది? అనే విషయాన్ని పక్కన పెడితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజీపీ కలలను చిత్తు చేసిన మమతా బెనర్జీ, జాతీయ స్థాయిలోనూ బీజేపీకి ప్రదాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు.  
అయితే, ఇటీవల జరిగిన గోవా,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ఫలితం లేక పోయింది.

రెండు రాష్ట్రాలలోనూ ఒఅక్తి రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, పశ్చిమ  బెంగాల్’లో మాత్రం ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన మమత,ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి చెమటలు పోయిస్తుననారు. గత సంవత్సరం (2021) మర్త్చి , ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్’కు గాటి పోటీ ఇచ్చినా, చివరకు 77 స్థానాలతోనే సరి పెట్టుకోవలసి వచ్చింది. అయితే, గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎంపీలు వెంటనే రాజీనామా చేయడంతో బీజేపే సంఖ్య 75కు పడిపోయింది. ఇక అప్పటి నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తృణమూల్ తీర్ధం పుచ్చుకోవడంతో, 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 69కి దిగివచ్చింది. తాజాగా బెంగాల్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ అర్జున్‌సింగ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆయ‌న‌తో పాటు త‌న కుమారుడు. ఎమ్మెల్యే  పవన్ సింగ్ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో .. మమతా బెనర్జీ జాతీయ కళలు ఎలా ఉన్నప్పటికీ. రాష్ట్రంలో మాత్రం బీజేపీకి మమత చుక్కలు చూపిస్తున్నారు. అందుకే  జాతీయ స్థాయిలోనూ బీజేపీకి అయితే గియితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆ పార్టీ సారధ్యంలోని కూటమి ప్రధాన ప్రత్యర్ధి అవుతారు. మమతా దీదీ , ప్రధాన మోడీకి ప్రత్యర్ధి అవుతారని రాజకీయ విశ్లేషణలో వినిపిస్తోంది.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.