జగన్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై?.. కాంగ్రెస్ గూటికి మల్లాది విష్ణు?

Publish Date:Jan 3, 2024

Advertisement

నిన్నటి వరకూ అదిగో ఇదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ వచ్చేసింది. మొదట జాబితాలో 11 మందిని మార్చేయగా.. ఇప్పుడు 27 మందిని మార్చేశారు. మొత్తంగా వైసీపీ 38 మంది ఇన్‌ఛార్జ్‌ల్ని ఇప్పటివరకు మార్చేసింది. ఫస్ట్‌ లిస్ట్‌లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే, సెకండ్‌ లిస్ట్‌లో  ఎంపీ టికెట్స్‌ కూడా ప్రకటించేశారు. సెకండ్‌ లిస్ట్‌లో 11 మంది సిట్టింగ్‌లకు షాక్‌ ఇచ్చారు జగన్‌.  వీళ్లల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాగా, ఒకరు ఎంపీ. వీరిలో కొందరు తీవ్ర ఆగ్రహంతో ఉండగా.. మరికొందరు అసలు పోటీ చేసేవరకూ నమ్మకం లేదని తెలుస్తున్నది. ఇక టికెట్ లేదని తేలిన వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి కొందరు ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని, తమకు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వెల్లడించాలని జగన్ ను   ప్రశ్నిస్తున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిలో విజయవాడ సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు.‌  

విష్ణుకు జగన్ షాకిచ్చారు. సెంట్రల్‌ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో విష్ణు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆయన అనుచరులైతే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనకు టికెట్ లేదన్న అధిష్టానం నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరుల ఆందోళన బాట పట్టారు. బందరు రోడ్డులో విష్ణు అనుచరులు బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విష్ణుకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. విష్ణును మార్చడంపై అసంతృప్తితో రగిలిపోతున్న విష్ణు వర్గం త్వరలోనే జింఖానా మైదానంలో సమావేశమై.. జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని.. తమ డిమాండుకు తలొగ్గకపోతే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

నిజానికి విష్ణు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన నేత. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డికి విష్ణు అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పుకుంటారు. అలాంటి విష్ణుకు జగన్ హ్యాండిచ్చేశారు. మల్లాది విష్ణు కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ హయాంలో వుడా చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత విష్ణు వైసీపీకి మారారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి విజయం సాధించారు. దీంతో జగన్ విష్ణుకు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా నియమించి ఆయనకు కేబినెట్ హోదాను కూడా కల్పించారు. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో కొనసాగారు. ఈసారి ఎలాగైనా అదే సెంట్రల్ నుండి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.

కానీ, జగన్ ఆయనకు షాక్ ఇస్తూ ఆయనను అక్కడ నుండి లేపేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైందో మళ్ళీ అదే పార్టీకి వెళ్లడానికి డిసైడైపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన మల్లాది విష్ణు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మల్లాది షర్మిలతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తుండడంతో పాటు ఏపీపై ఫోకస్‌ పెడతారన్న ప్రచారం సమయంలో విష్ణు మళ్లీ తిరిగి హస్తం గూటికే చేరే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. ఆ మాటకొస్తే విష్ణు ఒక్కడే కాదు.. అదే బాటలో చాలామంది అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేలకు షర్మిల బెస్ట్ ఛాన్స్ గా మారేలా కనిపిస్తుంది. వైసీపీలో గెలుపు అవకాశం లేని ఎమ్మెల్యేలు, స్థానాల మార్పునకు ఇష్టపడని నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ ఛాయిస్ గా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే షర్మిల వెంట నడుస్తూ.. కాంగ్రెస్ లోకి వెళ్లే తొలి వైసీపీ ఎమ్మెల్యే తానేనని కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలో ఇదే బాటలో ఎంతమంది నడవనున్నారో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.