తెలుగుదేశంలోకి దండు యాత్ర.. జర జాగ్రత్త!

Publish Date:Jan 3, 2024

Advertisement

ఎన్నికలు సమీపిస్తున్నాయి.  అలాంటి సమయంలో.. ఓ రాజకీయ పార్టీలో నుంచి మరో పార్టీలోకి గాలి వాటం నేతలు.. అంటే అయారాం.. గయారాంలు మళ్లీ... పార్టీ కండువా మార్పిడి  కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే అలాంటి దండు.. మిడతల దండులా దూసుకొస్తున్నదని.. అలాంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని లేకుంటే.. తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ స్థితిలోనే కొనసాగే అవకాశముందని.. తెలుగుదేశం  శ్రేణుల్లో  ఆందోళనగా వ్యక్తమవుతోంది. 

ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో  వైసీపీ విజయం సాధించడంతో తెలుగుదేశం  ప్రతిపక్షానికే పరిమితమైంది.  గతంలో అంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  ప్రతిపక్ష పాత్ర పోషించినా.. ఏనాడు పడని ఇబ్బంది..  విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎదుర్కొంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి  కింద స్థాయి కార్యకర్తవరకూ జగన్ పార్టీ వేధింపులను ఎదుర్కొన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  జగన్ ముఖ్యమంత్రి గా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజా వేదిక కూల్చివేత నుంచి..   స్కిల్  కేసులో  చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం వరకూ సీఎంగా జగన్ చేసిన ప్రతి పనీ విపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా సాగింది. 

 తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోని.. రాజకీయ ఓనమాలు దిద్దుకొన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు..  జగన్ పార్టీలో చేరిన తర్వాత  చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదంతా జగన్ ప్రోద్బలంతోనే, ఆయన ఆదేశాలతోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వీరిద్దరే అని కాదు..  జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై రకరకాలుగా వ్యంగ్య బాణాలు సంధించారు.. అయితే ఆ సమయంలో ఇలా మాట్లాడడం తప్పు.. చాలా పెద్ద తప్పు.. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొండి.. అంతేకానీ.. వారి ఫ్యామిలీని ఇలా కించ పరచడం.. ఇంట్లో వారిని బయటకు లాగడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం చాలా దారుణమంటూ.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ.. ఫ్యాన్ పార్టీలో అగ్రనేతలు కానీ... ప్రజాధనాన్ని లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు కానీ..  ఒక్క మాట చెప్పిన పాపాన పోలేదు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత..  తెలుగుదేశం  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు అందరిపైనా పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.  అలాంటి సమయంలో సైతం.. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని.. నేడు అధికారం మీ వద్ద ఉంటే.. రేపు మరో పార్టీ పరం అవుతుందని.. అలాంటి పరిస్థితుల్లో.. ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే.. రేపు ఇదే పరిస్థితి మనకు మన పార్టీలోని వారికి ఎదురైతే.. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఓ ఆలోచన చేయాలని సూచించాల్సిన పెద్దలు..  జగన్ పార్టీలో లేరని.. ఎవరైనా ఉన్నా వారు మౌనముద్రే వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే దాదాపుగా ఇదే విషయాన్ని గతంలో అంటే.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల వేదికగా.. ఆయన ముఖ్య అనుచరుడు సుబ్బారావు గుప్తా.. ప్రస్తావించి.. సదరు ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు సుభానీ చేతిలో గుప్తాకు తకదిన తోం తకదిన తోం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.    

ఇక టోటల్‌గా చెప్పోచ్చేదేమిటంటే.. అధికార వైసీపీ నుంచి వచ్చేసిన వారు.. వస్తున్న వారు.. రావాలనుకుంటున్న వారు.. గతంలో వారు తెలుగుదేశంలో ఉన్నవారైనప్పటికీ  పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఎలా వ్యవహరించారన్న విషయాన్ని గమనించాలని.. లేకుంటే అలాంటి వారు .. పార్టీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల... పార్టీలో జెండా కర్రలాగా పాతుకుపోయిన అసలు సిసలు నేతల నుంచి శ్రేణుల వరకు హోల్ సేల్‌గా దెబ్బయిపోతారని.. ఎందుకంటే.. ఈ సారి ఎన్నికల్లో పార్టీ  గెలిచినా.. భవిష్యత్తులో ఓ వేళ మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. ఇలా పార్టీలు మారే అయారాం గయారాంలు..  ఇట్టే గోడలు దూకేస్తారని.. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన వారు ఎవరు, మన వాడా, మన బాగు, పార్టీ బాగు కోరే వాడా? కాదా? వాడిలో లేశమంత అయినా .. నీతి నిజాయితీ గట్రా లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా... అనేవి పరిశీలించాలని.. పార్టీ అధినాయకత్వానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్  సూచిస్తున్నారు. అలా కాకుంటే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటే..  ఆ పార్టీ కుండువా కప్పుకొని.. ఆ పార్టీ రంగు చొక్కా తొడుక్కొని.. పండగ వేళ.. చందాల కోసం వచ్చిన.. వస్తున్న బాపతు లాంటి వాళ్లా అన్నా ఆలోచన చేయాలని పార్టీలోని కీలక నేతలకు సైకిల్ పార్టీ శ్రేణులు ఓ సూచన చేస్తోంది.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.