బడి సెలవలివ్వగానే అమ్మమ్మ దగ్గరికి వెళ్లడం పిల్లలందరికీ సరదా. గ్రామంలో సెలవలు స్వేచ్ఛగా గడిపేయచ్చని, కుర్రాళ్లకి కులూ మనాలీ పిచ్చీ ఉండవచ్చు. అసలా మాటకి వస్తే వేరే ప్రాంతాలు సంద ర్శించాలనుకునేవారికి దేశంలో ఎక్కడికైనా వెళుతూంటారు. కానీ చిత్రంగా ఈ విదేశీయులు ఇద్దరూ ఏకం గా తెలంగాణా వచ్చి పనిగట్టుకుని జైల్లో రెండు రోజులు గడిపారు. ఇదేమి ఆనందం. ఆనందమే అదో చిత్రమైన అనుభూతి! ఇద్దరూ టూరిస్టులే.. దొంగలు కారు.
ప్రతీ దేశం, ప్రతీ ప్రాంతం టూరిస్టులను ఆకట్టుకోవడంలో దూకుడుగానే ఉంటాయి. అనేక ప్రాంతాలను అందరికీ ఆకట్టుకునే విధంగా మారుస్తుంటారు. పాతకాలం కట్టడాలు, భవంతులు, హోటళ్లతో సహా అన్నీ టూరిజం శాఖ బ్రహ్మాండంగా తయారుచేసి దేశ, విదేశీ టూరిస్టుల నుంచి మెప్పు పొందడానికి పెద్ద దండలతోనే గమ్మంలో ఎదురుచూస్తుంటారు.
కానీ ఇటీవల తెలంగాణాకు ఇద్దరు టూరిస్టులు కౌలాలం పూర్ నుంచి వచ్చారు. నిగ్ ఇన్ ఊ, అతని స్నేహితురాలు ఒంగ్ బూన్ టెక్. వీళ్లిద్దరూ భారత్‌లో పురాతన కట్టడాలు ప్రదేశాలు సందర్శించాలను కుని ఎంతో ప్లాన్ చేసుకుని మరీ వచ్చారు. కానీ వారిని సంగారెడ్డి జైలే ఎక్కువ ఆకట్టుకుంది! కానీ ఇదేమీ పిచ్చి వెర్రీ కాదు కావాలనే జైలుకి వెళ్లారు. తెలంగాణా పర్యావరణ శాఖ ఒక చిత్రమైన కార్యక్రమం చేప ట్టింది. దాని పేరు.. ఫీల్ ద జైల్! ఇందులో భాగంగా ఎవరయినా సరే 24 గంటలపాటు సంగారెడ్డి జైల్లో గడపవచ్చు. అంటే అసలు జైల్లో వాతావరణం ఎలా ఉంటుంది, జైల్లో ఉన్నవారిని ఎలా చూస్తారు, అక్కడ దోషులకు ఎలాంటి వసతులు కల్పిస్తారు ఇలాటివన్నీ తెలుసుకోను వీలుంటుంది. పైగా అతి పురాతన మైన కట్టడం కనుక సహజంగానే పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
మలేషియా నుంచి వచ్చిన ఈ ఇద్దరు టూరిస్టులకు అదే ఆసక్తికరంగా అనిపించింది. సంగారెడ్డి జైలు 1796 ఎ.డి లో ప్రధాని మొదటి సాలార్‌జంగ్ సమయంలో నిర్మించారు. అంటే 220 సంవత్సరాల క్రితంది. కేవలం గోల్కొండ, చార్మినార్ లే కాకుండా ఇలాంటి పురాతన కట్టడాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా జైలు అనగానే భయపడతాం. కానీ దీన్ని జైలులా కాకుండా పర్యాటక ప్రదేశం, కట్టడంలా భావిస్తే సరి. మలేషియా జంట రూ.500 చెల్లించి రెండు రోజులు సంగారెడ్డి జైల్లో గడిపారు. అక్కడి భోజనం, వసతి వారికి ఎంతో నచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/malaysian-tourists-in-sangareddi-jail-39-141562.html
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.