ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ పోల్స్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తే ఒక్క కేకే సర్వే మాత్రం ఢిల్లీ పీఠంపై మళ్లీ ఆప్ జెండాయే ఎగురుతుందని ఢంకా బజాయించి మరీ చెప్పింది.
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36.
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39 నుంచి 49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు దక్కు అవకాశం ఉంది. కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. అలాగే పీపుల్స్ పల్స్, జేవీసీ పోల్, పీపుల్స్ ఇన్ సైట్, చాణక్యా స్ట్రాటజీస్ సహా పలు సంస్థలు కూడా తమతమ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ విజయమే ఖరారైందని పేర్కొన్నాయి. అయితే మార్జైజ్ సర్వే మాత్రం ఢిల్లీలో హండ్ ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
ఇవి కాకుండా మైండ్ బ్లింక్, మరో సంస్థ నిర్వహించిన సర్వేలు ఆప్ ఢిల్లీలో మూడో సారి అధికారం చేజిక్కించుకునే అవకాశాలున్నయని అంచనా వేశాయి. అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దళితుల నుంచి గట్టి మద్దతు లభించిందనే పేర్కొన్నాయి. అలాగే మహిళా ఓటర్లు మొగ్గు కూడా ఒకింత అధికార పార్టీవైపే కనిపించిందని చెప్పారు.
ఇక కచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే కేకే సర్వే మాత్రం ఢిల్లీలో ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు కైవశం చేసుకోవడం ఖాయమని పేర్కొంది. ఆ సర్వే ప్రకారం ఆప్ కచ్చితంగా 39 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీకి 22 స్థానాలలో విజయం దక్కుతుంది. ఇక మిగిలిన తొమ్మిది స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుంది. వాటిలో కూడా ఓ ఐదు స్థానాలలో మొగ్గు ఆప్ వైపే ఉంది. మిగిలిన నాలుగు స్థానాలలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయి. అంటే కేకే సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 44, బీజేపీకి 26 స్థానాలు దక్కుతాయి. వాస్తవంగా ఢిల్లీ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకూ వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/majority-exit-polls-predict-bjp-win-in-delhi-39-192438.html
నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది.
పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంటుంది.
దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది.
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.