తాడేపల్లి ప్యాలెస్ బయట మంటలు.. ఇది గులకరాయా? కోడి కత్తా

Publish Date:Feb 5, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు ఆవలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనిని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.  మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై వైసీపీ చేస్తున్న అతి చూస్తుంటే అనుమానంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ నివాసం బయట రోడ్డు పక్కన బుధవారం సాయంత్రం రెండు సార్లు మంటలు వచ్చాయి. తీరా చూస్తే అది చాలా చిన్న అగ్ని ప్రమాదం. దీనికే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఈ స్వల్ప అగ్నిప్రమాదం కూడా జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా రోడ్డుకు ఆవలి పక్కన జరిగింది. ఈ స్వల్ప అగ్నిప్రమాదంపై జగన్ బ్యాచ్ చేస్తున్న హడావుడీ హంగామా చూస్తుంటే..  గతంలో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, గులకరాయి దాడులు గుర్తుకు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఇలా ఉండగా అది ప్రమాద వశాత్తూ జరిగింది కాదనీ,   జగన్ హయాంలో మద్యం స్కాంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేయగానే.. తాడేపల్లి పునాదులు ఎక్కడ కదిలిపోతాయోన్న భయంతో  ఆ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు, డైరీలను వైసీపీయులే తగలబెట్టేసి, అగ్ని ప్రమాదం, భద్రతా లోపం అంటూ కథలల్లుతున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భూ దందాకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేయడానికి ఏకంగా మదనపల్లి తహశీల్దార్ కార్యాలయంలోనే అగ్నిప్రమాదాన్ని సృష్టించిన ఘనత వైసీపీదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

నిజంగానే  భద్రతా లోపం కారణంగా జరిగిన అగ్నిప్రమాదం అయితే బుధవారం సాయంత్రం మంటలు చెలరేగితే దాని సీసీ ఫుటేజీని ఇంత వరకూ ఎందుకు బయటపెట్టలేదని తెలుగుదేశం ప్రశ్నిస్తున్నది.  తానే దాడులు చేయించుకుని తానే ఎదుటి వారిపై నిందలు వేయడం జగన్ కు అలవాటేనంటూ తెలుగుదేశం ట్వీట్ చేసింది.  తానే తగులబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? అంటూ నిలవీసింది. ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్' అని ఆ ట్వీట్ లో పేర్కొంది. తెలుగుదేశం, వైసీపీల విమర్శలు ఆరోపణలు అలా ఉంచితా.. అసలు అగ్ని ప్రమాదం జరిగిన తీరే చాలా అనుమానాస్పదంగా ఉంది.  మంటలు వస్తున్నా జగన్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని ఆర్పండంపై కాకుండా వీడియోలు తీయడంపైనే శ్రద్ధ చూపడం ఉద్దేశపూర్వకంగానే అక్కడ వేటినో తగులబెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అన్నిటికీ మించి అతి స్వల్పంగా వచ్చిన మంటలపై వైసీపీ ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు చేస్తున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   

అగ్ని ప్రమాదం మాటున, జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం కూటమి  సిట్   వేయగానే  జగన్ ఇంటి ముందు స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం.. ఆ ప్రదేశంలో కొన్ని కాగితాలు కాలి ఉండటంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. 

జగన్ విదేశీ పర్యటన ముగించుకుని, ఆ తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని చాలా రోజుల తరువాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంపై సీట్ ఏర్పాటు చేసిందని తెలియడంతోనే ప్యాలెస్ లో  ఉన్న మద్యం కుంభకోణానికి సంబంధించి పత్రాలను బయటపడేసి తగులబెట్టించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తాడేపల్లి ప్యాలెస్ లో  దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ వీడియోలు తీయగల అధునాతన సీసీటీవీ లు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను బయటపెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదం వివరాలన్నీ బయటకు వస్తాయి. అయితే ఆ పని చేయకుండా జగన్ పై హత్యాయత్నం, ఇళ్లు తగలెట్లే యత్నం అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊరూవాడా ఏకమయ్యేలా చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి దాడి, గులకరాయి దాడి సందర్భంగా వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇక్కడా సానుభూతి ప్రోది చేసుకోవడానికి పడుతున్న తాపత్రయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సానుభూతికి తోడు.. మద్యం కుంభకోణం ఫైళ్లను కూడా దగ్ధం చేసేసి ఒకే దెబ్బకు రెండు లాభాలు పొందే అవకాశం కోసం అర్రులు చాచినట్లుగా కనిపిస్తోందంటేన్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.