Publish Date:Feb 26, 2026
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్‌లో మాన్యవర్, మంగళగౌరీ దుకాణాలు ఉన్న భవనానికి ఎలివేషన్ పనులు జరుగుతున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. పై అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎలివేషన్ కోసం నిర్మించిన తాత్కాలిక కట్టడంపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలోని మూడో అంతస్తులో ఇద్దరు మహిళలు, ఐదో అంతస్తులో నలుగురు పురుష కార్మికులు పని చేస్తుండగా పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించడంతో వారు లోపలే చిక్కుకుపోయారు. మంటలు చుట్టుముట్టడంతో మహిళలు అరుపులు, కేకలు వేస్తూ సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ మొదట ఎవరూ స్పందించలేదని బాధితులు తెలిపారు.
ఐదో అంతస్తులో ఉన్న ఒక మహిళ భర్త మూడో అంతస్తుకు చేరుకుని అక్కడి అద్దాలను పగలగొట్టాడు. రాజు అనే కార్మికుడు నిచ్చెనలను కిందికి వేసి బయటకు రావడానికి మార్గం కల్పించాడు. అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో ఇద్దరు మహిళలు సురక్షితంగా కిందికి దిగారు. అనంతరం మిగతా నలుగురు కార్మికులు కూడా బయటపడగలిగారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, గత వారం రోజులుగా ఈ భవనంలో పనులు చేస్తున్నామని, ప్రమాద సమయంలో తమను పనిలోకి పెట్టుకున్న యజమాని ఫోన్ కూడా ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/major-fire-in-jubilee-hills-36-214701.html
భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి విరామం ప్రకటించి, ఇరాన్ పది సూత్రాల శాంతి ప్రతిపాదనను భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. గంటల వ్యవధిలోనే ఇరాన్ తో శాంతి ఒప్పందానికి, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకూ సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ కు వంత పాడారు.
అంతటా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రధాన చోదక శక్తిగా నిలుస్తూనే ఉంది; విస్తృత ఆర్థిక దృక్పథం అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది ఒక రకమైన స్థిరత్వాన్ని అందిస్తోంది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న తొలి భారతీయ ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం.ఈ నౌక ప్రయాణం ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య, ప్రమాదాల మధ్యా సాగింది. హోర్ముజ్ జలసంధిలో నియంత్రణను కఠినతరం చేసిన ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారత్ ఈ రవాణాను సుసాధ్యం చేసింది.
నియోజకవర్గంలోని ఒక 40 మంది లబ్ధిదారుల జాబితా పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికాడు. దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ. 1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎమ్మెల్యే పల్లా ఆ వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మేసి.. తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి పంపించారు.
జైశ్వాల్ ఒక విదేశీ యువతితో తరచుగా కనిపిస్తుండటంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆమె పేరు మ్యాడీ హామిల్టన్. బ్రిటిషర్ అయిన ఈమెతో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని సమాచారం.
అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమో, వ్యూహాత్మక కారణాల రీత్యానో పాకిస్థాన్ సేవలను వినియోగించుకోవచ్చని, అయితే ఇజ్రాయెల్ దృష్టిలో మాత్రం ఆ దేశం ఏ మాత్రం నమ్మదగినది కాదని రూవెన్ అజార్ స్పష్టం చేశారు.
నిందితులు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరంతా ఒక రహస్య నెట్‌వర్క్‌గా ఏర్పడి, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
దేవుబాపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు గత ఏడాదే బీజం పడింది. ఖాట్మండు శివార్లలోని బుధనీల్‌కంఠలో ఉన్న వీరి నివాసంలో సగం కాలిన కరెన్సీ నోట్లు లభించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు.
ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డికి గతంలో కోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బెయిలు మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరై సంతకం చేయాలనే నిబంధనను విధించింది.
ఒప్పందంలో లెబనాన్ పై దాడులు జరపకూడదని లేదంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు తెగబడటమే. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ అంటుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పుకు వస్తున్నది.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం గుజరాత్ టైటాన్స్ ను వరించింది. స్టేడియంలో చూస్తున్న ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్ ను తిలకించిన వీక్షకులను సైతం మునివేళ్ల మీద నిలబెట్టేసేంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగింది. అయితే.. ఇదే మ్యాచ్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.