తెలంగాణలో ‘మహా ’ తరహా సంక్షోభం ?
Publish Date:Jul 9, 2022
Advertisement
ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్న రోజుల్లో .. ఒకానొక ఆదివారం ఏదో జరిగి పోతుందని ఉహాగానాలు వినిపిస్తున్న సమయంలో... ఆదివారం తర్వాత ఏమి జరుగుతుంది? అనే ప్రశ్నకు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, చక్కగా నవ్వుతూ సోమవారం వస్తుంది...అని సమాధానం ఇచ్చారు. అయన సరదాగానే ఆ సమాధానం ఇచ్చినా, నిజంగా కూడా అదే జరిగింది. ఆదివారం తర్వాత సోమవారం వచ్చిందే కానీ ఉహాగానాలు నిజం కాలేదు, ఉసూరు మన్నాయి. అప్పటి పరిస్థితి ఆదయితే, ఇప్పడు కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో ఉహాగానాలు ముందు కంటే మహా వేగంగా పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చాలా వరకు ఉహాగానాల చుట్టూనే తిరుగుతున్నాయి.ఈ మధ్యకాలంలో అయితే ఉహాగానాల జోరు మరింత హుషారుగా సాగుతోంది. ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామల నేపధ్యంలో, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే మాట వినవస్తోంది. నిజమే, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మరి కొందరు బీజేపీ నాయకులు అలాంటి హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేసిన మాట నిజం. అందులో ఒకరిద్దరు తెలంగాణకు చెందిన కీలక నాయకులు కూడా ఉన్నారని అంటున్నారు. ఇక అక్కడి నుంచి మహారాష్ట్రలో, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన విధంగానే, బీజేపీ తెలంగాణ ప్రభుత్వాని సాగనంపేందుకు స్కెచ్ సిద్ధం చేసిందని ఉహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. చివరకు, సహజంగా ఇలాంటి ఉడత ఊపులకు బెదరని, ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా, మీడియాలో షికార్లు చేస్తున్న వదంతులపై స్పందించారు. బీజేపీకి దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని ముట్టి చూడాలని సవాలు విసిరారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాని బీజేపీ కూలిస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని తాము కులుస్తామని, హెచ్చరిక కుడా చేశారు. అయితే, మహా రాష్ట్రలోలో ప్లే చేసిన ట్రిక్, తెలంగాణలో రీప్లే చేయడం బీజేపీకి సాధ్యమేనా? అక్కడిలా ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అవుతుందా అంటే, అది అయ్యే పనికాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అసలు బీజేపీ అలాంటి, ‘తప్పు’ చేయదని బీజేపీ సీనియర్ నాయకులు కూడా, ఉహాగానాలను కొట్టేస్తున్నారు. అది నిజం కూడా ఎందుకంటే మహారాష్ట్రకు, తెలంగాణకు అసలు పోలికే లేదు. మహారాష్ట్రలో బీజేపీ ఒక బలమైన పార్టీ. రాష్ట్ర శాసన సభలో వందకు పైగా స్థానాలతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజామోదం ఉన్న పార్టీ. నిజానికి 2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి కుర్చీ కొట్లాటలో, శివసేన, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి, అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులోనూ శివసేన, బీజేపీల మధ్య హిందుత్వ బంధం ఒకటుంది. సో. శివసేనలో చీలిక తెచ్చి , అఘాడి ప్రభుత్వాని కూల్చడం కొంచే ఈజీ అయింది. తెలంగాణలో అలాటి పరిస్థితి లేదు. తెలంగాణ శాసన సభలో తెరాస 103 మంది సభ్యులుంటే బీజేపీ కి ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో.. మహారాష్ట్ర రాజకీయం తెలంగాణాలో సాగదు. నిజానికి ఈ విషయంలో ఎవరికీ క్లారిటీ ఉన్నా లేకున్నా బీజేపీ జాతీయ నాయకత్వానికి మాత్రం టోటల్ క్లారిటీ ఉందని సో అలాంటి తప్పు చేయదని బీజేపీ సీనియర్లు స్పష్టం చేశారు. అయినా ఉహాగానాలు మాత్రం ఇంకా అలా కొనాసగుతూనే ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో జరుగుతుందని ఉహించుకుని, ఏం జరుగుతుంది ? అనే ప్రశ్నలు వేసుకుని, ఉహాగానాల ఆధారంగా చేస్తున్నవిశ్లేషణలు నిజం కాకపోవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే, కొంత మంది ఉహిస్తున్నట్లుగా, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత, ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు మొదలవుతాయి, తెరాస చీలిపోతుంది, ఇంకేదో జరుగుతుంది అనుకోవడం పొరపాటే అంటున్నారు. సో... రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఉప రాష్టపతి ఎన్నిక వస్తుంది. అంతే తెలగాణలో మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభానికి మాత్రం ... నో ఛాన్స్ .. అంటున్నారు .
http://www.teluguone.com/news/content/maharashtra-like-political-crisis-in-telangana-25-139409.html





