ఉపరాష్ట్రపతి అభ్యర్ధి పై ఏకాభిప్రాయ సాధన బాధ్యత ఖర్గేకి
Publish Date:Jul 9, 2022
Advertisement
కాంగ్రెస్ ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికపై దృష్టిపెట్టింది. బిజేపీయేతర పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధన బాధ్యతను పార్టీ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున్ ఖార్గేకు బాధ్యతలు అప్పగించింది. బిజెపీయేతర పార్టీలతో చర్చించి తగిన అభ్యర్ధిని ఎంపిక చేసే ప్రక్రియను ముమ్మరం చేసింది. త్వరలో ఇందుకు సంబంధించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. అయితే అంతకు ముందే ఉపరాష్ట్రపతికి తగిన అభ్యర్ధుల జాబితాను విపక్షాల మద్దతుతో తయారుచేయాలి కాంగ్రెస్ అధ్య క్షురాలు సోనియా భావిస్తున్నారు. అయితే ఆ అభ్యర్ధి కాంగ్రెస్ నుంచే వుండాలన్న అవసరమేమీ లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. విపక్షాల్లో ఏ పార్టీకి చెందినవారయినా కావచ్చుననే అభిప్రా యాలు వినపడుతున్నాయి. ఏమైనప్పటికీ అందరికీ ఆమోదయోగ్యుడినే చివరగా ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేస్తారు. కాగా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ప్రచారం గురించి చర్చించేందుకు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్ బుధ వారం ఢిల్లీలో సమావేశమయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా, మల్లికార్జున ఖార్గే, సిపిఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నేత బాలచంద్ర కాంగో, ఆర్‌జెడి నేత ఎ.డి. సింగ్ పాల్గొన్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్‌డిఏ ప్రతిపాదిస్తున్న వారిలో తవార్ చంద్ ఘెలాట్, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ వున్నారు. అయితే రాష్ట్రపతి పదికి అభ్యర్ధిగా ముర్మీని ప్రకటించినట్లు ఉప రాష్ట్ర పదవికి అభ్యర్ధిని ప్రకటించడంలో ఎన్‌డిఏ నిర్ణయం చివరగా అందర్నీ ఆశ్చర్యపరిచవచ్చు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఆగస్టు 6వ తేదీ జరుగు తుందని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొంటారు. పార్లమెంటు ఉభయ సభల మద్య బిజెపికి 395 ఎంపీలు, లేదా ఓట్లు వున్నాయి. అంటే విజయానికి కావలసిన 388 కంటే ఏడు ఓట్లు అధికం. నామినేషన్లకు జూలై 19తో గడువు ముగుస్తుందని కమీషన్ పేర్కొన్నది. పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన ఎలక్టరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎంపిక చేస్తుంది. ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ ఆగస్టు పదవ తేదీతో ముగియనుంది.
కాగా నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డిఏ) మాత్రం ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ఎవరిని అనుకుంటు న్నారన్నది ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ప్రకటించాయి. ఆయన బిజెపీ నాయకత్వంలోని ఎన్‌డిఏ అభ్యర్ధి ద్రౌపది ముర్మూతో పోటీపడ తారు. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరుగుతుంది.
http://www.teluguone.com/news/content/congress-gave-responsibility-to-kharge-25-139407.html





