రాజమహేంద్రవరంలో మహా సందడి

Publish Date:May 26, 2023

Advertisement

రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రంగం సిద్దమైంది. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహానాడు మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. ఇప్పటికే రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరిలోని వంద ఎకరాల్లో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లును పక్కా ప్రణాళికలతో పూర్తి చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఆ మహానాడు వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభ సాక్షిగా ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.    

మరోవైపు   మహనాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీగా తరలి వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన వారు సైతం వస్తున్నారు. అయితే మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు నేపథ్యంలో విమాన ఛార్జీల ధరలు చుక్కలనంటాయి. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టికెట్ ధర 3 వేలు.. అదీకాకుంటే 3 వేల 5 వందల వరకు ఉండేదని... కానీ మే 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విమాన టికెట్ ధర దాదాపుగా 10 వేల రూపాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరు నుంచి రాజమండ్రికి కూడా దాదాపుగా ఆయా తేదీల్లో ఇదే ధర లేకుంటే మరికాస్తా అధికంగా ఉన్నట్లు  సమాచారం. 
అలాగే రాజమండ్రితోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని కాకినాడ, అమలాపురంతోపాటు ఇటు కోవ్వూరు, నిడదవోలులో ఇప్పటికే హోటల్స్‌లో రూములు సైతం భారీగా బుక్ అయినట్లు తెలుస్తోంది. అదీకాక మహానాడు నేపథ్యంలో హోటల్స్‌లో రూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటినట్లు ఓ టాక్ అయితే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సాగుతోంది.      

మహనాడుకు వేదిక అయిన రాజమహేంద్రవరం నగరం పసుపు శోభను సంతరించుకొంది. నగరం మొత్తం బంతిపూల వనంగా మారిపోయింది. నగరం ఆ మూల నుంచి ఈ మూల వరకూ.. అలాగే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పసుపు రంగు జెండాలతోపాటు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ధర్శనమిస్తున్నాయి. ఇంకోవైపు చంద్రబాబు డిజిటల్ సంతకం చేసిన మహానాడు ఆహ్వాన పత్రికలు.. ఇప్పటికే దేశవిదేశాల్లోని ప్రతినిధులకు అందాయి. 2006లో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మహనాడు జరిగితే.... ఆ తర్వాత అంటే 2023లో.. అదే రాజమహేంద్రవరంలో  తెలుగుదేశం పార్టీ మళ్లీ మహానాడు జరుపుకొంటోంది.  

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.