మహానాడుకు లోకేష్

Publish Date:May 26, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమహేంద్రవరం వేదికగా జరుగుతోన్న  మహానాడుకు హాజరవుతున్నారు.  ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో  సాగుతున్న పాదయాత్రకు ఆయన  గురువారం (మే25) తాత్కాలిక విరామం ఇచ్చి.. అమరావతి  చేరుకున్నారు.  శుక్రవారం (మే 26) నారా లోకేశ్ రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. మే 27, 28 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ఆయన మహానాడులో పాల్గొని.. మళ్లీ సోమవారం అంటే మే 29వ తేదీన  తన పాదయాత్రకు ఎక్కడ తాత్కాలిక విరామం ఇచ్చారో అక్కడ నుంచి  తిరిగి కొనసాగించనున్నారు. 

 నందమూరి తారకరత్న మరణించిన నేపథ్యంలో.. హైదరాబాద్ వచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి.. నివాళులర్పించి.. ఆ వెంటనే ఆయన మళ్లీ తన పాదయాత్రను కొనసాగించారు. ఆ సమయంలో తప్ప నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి.. ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా  విరామం ఇవ్వకుండా, విశ్రాంతి తీసుకోకుండా ముందుకు సాగుతున్నారు.   నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ... విజయవాడ, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కానీ.. అలాగే హైదరాబాద్ నడిబొడ్డు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు కానీ.. నారా లోకేశ్ రాలేదు.

ఇప్పుడు మహానాడుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ వస్తుండడం పట్ల.. పార్టీ శ్రేణుల్లో  ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  2023, జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం వేదికగా నారా లోకేశ్ యువగళం  పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఆ క్రమంలో ఇప్పటికే నారా లోకేశ్.. 14 వందల కిలోమీటర్ల మేర తన పాదయాత్రను పూర్తి చేసుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని సాధించే దిశగా.. ఆయన వడివడిగా అడుగులు వేసుకొంటు వెళ్తున్నారు. 

ఇంకోవైపు ఈ మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల పార్టీ  అధ్యక్షులు   అచ్చెన్నాయుడు, కాసాని జ్జానేశ్వర్లతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీగా ఈ మహనాడుకు తరలిరానున్నారు. అందుకోసం అన్నిఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు వివరించిన సంగతి తెలిసిందే.

By
en-us Political News

  
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.