Publish Date:May 27, 2025
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని మంత్రి టీజీ భరత్ అన్నారు. బయటి దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ. నేను ఈ మధ్య ఇండియా టుడే కాన్క్లేవ్ కి దుబాయ్ కి వెళ్లాను. శోభ బిల్డర్స్ అధినేత చంద్రబాబుకి పరిచయం లేదు, చూసింది కలిసింది లేదు. ఓ సందర్భంలో మాట్లాడుతూ రూ.100 కోట్లు ఏపీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా అన్నారు. చంద్రబాబు లాంటి లీడర్ షిప్ నాయకుడు మీకు ఉన్నాడు. ఆ రూ.100 కోట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వినియోగించుకోండని తెలిపారు. చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికి తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు టీజీ భరత్ అన్నారు.
కానీ పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను చూశారు. వారికన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు. నారా లోకేష్ కు ఓ మాట చెప్పమని నా స్నేహితుడు మంత్రి అన్నారు. నువ్వు మగాడ్రా బుజ్జి అని చెప్పమన్నారు. పల్లా శ్రీనివాస్ ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఏపీలో పెట్టుబడులు పెట్టకండని ఫారెన్ కంపెనీలు మన ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఆ విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని కొందరు పారిశ్రామిక వేత్తలు నాతో చెప్పారని ఆయన పేర్కొన్నారు
మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి స్వాగతిస్తాం.. కానీ గత వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను దారుణంగా అవమానించారు. గత ప్రభుత్వంలో టెక్స్ టైల్స్ పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. గైడ్ లైన్స్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. గత ప్రభుత్వం అంత ఘోరంగా పారిశ్రామిక వేత్తలను అవమానించారు. ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు వైసీపీ హయాంలో 10 మందికే పరిమితం చేశారు. 2014-19 లో 60 మందితో పనిచేశాం. నేడు దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. మన విధానాలు ప్రమోట్ చేయడంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఒక బోర్డు జపాన్ లో పర్యటిస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. చంద్రబాబు ఎప్పుడు స్పీడ్ అప్ డూయింగ్ బిజినెన్స్ పై చెబుతారు.
ఒక కంపెనీ ఏర్పాటు కావడం ఆలస్యం అయితే వడ్డీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఉదాహరణకి కర్నూల్ లో ఉన్న జైరాజ్ స్టీల్స్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కొన్ని కోట్లు వడ్డీలే సరిపోతుంది. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉంటే త్వరగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభింపజేసేలా పాలన సాగిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 11 ప్రారంభించాం. 39 పార్కులకు ఫౌండేషన్ వేశాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా పనిచేస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి. కచ్చితంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి వెల్లడించారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mahanadu-39-198806.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.