మహా వరుణయాగం సంపూర్ణం.. సీఎం రేవంత్‌ దంపతులు ప్రత్యేక పూజలు..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య నాగార్జునసాగర్‌లో ఈ యాగాన్ని నిర్వహించారు.

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన మహా వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మంత్రి  ఉత్తమ్ దంపతులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహం కోసం వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు.

కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతోనే మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

భారతీయ సంస్కృతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతూనే.. వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తున్నామని తెలిపారు.

వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యేలా వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరుణదేవుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని ఆకాంక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, కుంట జలకళను సంతరించుకోవాలని కోరుకున్నారు. భూగర్భ జలాలు పెరిగి, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ప్రార్థించారు.

రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మహా వరుణయాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Maha Varuna Yagam, Varuna Yagam, Rainfall, Telangana Rains, Telangana Government,
Nagarjuna Sagar, Vijay Vihar, Krishna River, CM Revanth reddy, Minister Uttam kumar reddy
 

By
en-us Political News

  
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ ప్రజల జీవితాలను, వ్యాపార ఆశయాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి. వోడాఫోన్ సర్వేలోని కీలక గణాంకాలు, విజయావకాశాలు మరియు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ట్రాక్‌లపై ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖానే ఎందుకు సరైన ఎంపికో కైఫ్ విశ్లేషించారు.
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.