అందుకే విద్యాశాఖ తీసుకున్నా : సీఎం రేవంత్‌రెడ్డి
Publish Date:Mar 6, 2026
Advertisement
తెలంగాణలో ప్రతీ పేదవాడికి విద్యను అందించడానికే స్వయంగా తానే విద్యాశాఖ తీసుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో మాదిగ ఎంప్లాయిస్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతు ఎస్సీ వర్గీకరణలో న్యాయం ఉంది.. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డానని రేవంత్ తెలిపారు. వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం.. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు.. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం 30 సంవత్సరాలు నలుగుతోంది.. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి..ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చింది..చెప్పులు కుట్టుకొమ్మని చెప్పింది.. బర్రెలు,గొర్రెలు , చేపలు కాదు.. చెప్పుకుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని నడపాలి.. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు మీరంతా కోరుకుంటే , ప్రజా పాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని సీఎం తెలిపారు. 2023లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదని రేవంత్ వెల్లడించారు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారు ఒక వైపు, చచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ది తో మేం చేసిన ప్రయత్నమని రేవంత్‌రెడ్డి తెలిపారు. మాటలు, మూటలతో అయితే మేం ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదార, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కాలె యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం పాల్గొన్నారు
http://www.teluguone.com/news/content/madiga-employees-coordination-committee-meeting-36-215123.html





